Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌పై బోనీ కపూర్ క్లారిటీ..
ఇండియన్ సినిమాలో బయోపిక్స్‌కు నెవర్ ఎండింగ్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ కాంట్రవర్సియల్ బయోపిక్స్ అయితే తిరుగుండదు. అందుకేనేమో శ్రీదేవి లైఫ్‌పై సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా వేచి చూస్తున్నారు అభిమానులు. తాజాగా తన భార్య బయోపిక్‌పై కుండ బద్దలు కొట్టేసారు బోనీ కపూర్. మరి ఆయనేం చెప్పారో చూద్దామా..? శ్రీదేవి చనిపోయి ఆరేళ్లు దాటినా.. ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు.