- Telugu News Photo Gallery Cinema photos Priyamani latest mesmerizing looks in saree goes viral in internet
Priyamani: అందం ఈ కోమలితో పోటీలో ఓడి దాసిగా మారింది.. మెస్మరైజ్ ప్రియమణి..
ప్రియమణి తెలుగు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించే ఒక నటి. ఆమె ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డ్, మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక అవార్డులను అందుకున్నారు. తెలుగులో పెళ్ళైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, కింగ్, సాంబో శివ సాంబో, గోలీమార్, రగడ క్షేత్రం, నారప్ప, భామాకలాపం వంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది ఈ భామ.
Updated on: Mar 21, 2025 | 5:40 PM

4 జూన్ 1984న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది అందాల భామ ప్రియమణి. ఈ వయ్యారి పూర్తి పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. స్క్రీన్ నేమ్ ప్రియమణిగా మార్చుకుంది ఈ క్రేజీ బ్యూటీ.

ఈ అందాల భామ తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్ మొక్కల వ్యాపారి, సొంతం ఇంటి వద్దనే నర్సరీ నడుపుతున్నారు ఆయన. మాజీ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లతామణి అయ్యర్ ఈమె తల్లి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నారు.

చదువుకునే రోజుల్లో కాంచీపురం సిల్క్, ఈరోడ్ భరణి సిల్క్స్, లక్ష్మి సిల్క్స్‌లకు మోడల్‌గా చేసింది ఈ బ్యూటీ. పాఠశాలలో ఉన్నప్పుడు కొన్ని కల్చరల్ యాక్టీవిషస్, క్రీడలు వంటి వాటిలో చురుకుగా పాల్గొనేది ఈ వయ్యారి భామ.

12వ తరగతి చదువుతున్నప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా ఈ ముద్దుగుమ్మను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ బ్యూటీ కర్నాటక గాయకురాలు కమలా కైలాస్ కి మనవరాలు. సినీ నటి విద్యాబాలన్ కోడలు. నేపథ్య గాయని మాల్గుడి శుభ మేనకోడలు..

2003 ఎవరే అతగాడు అనే తెలుగు సినిమాలో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ హోదాకు ఎదిగింది. ప్రస్తుతం లేడీ ఓరియంట్ చిత్రాలతో అదరగొడుతుంది.





























