Wamiqa Gabbi: మత్తెక్కిస్తున్న వామిక ఫొటోస్.. కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్
సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ట్రెండ్ అవుతారో చెప్పలేం. అలా ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు యమా ట్రెండింగ్ అవుతోంది. ఈ బ్యూటీ ఓరకంటతో చూస్తున్న ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా.! కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమా చేసిన ఈమె మరెవరో కాదు.. వామికా గబ్బి.
Updated on: Mar 21, 2025 | 2:58 PM

సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ట్రెండ్ అవుతారో చెప్పలేం. అలా ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు యమా ట్రెండింగ్ అవుతోంది. ఈ బ్యూటీ ఓరకంటతో చూస్తున్న ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారా.!

కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమా చేసిన ఈమె మరెవరో కాదు.. వామికా గబ్బి. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'భలే మంచి రోజు' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్ కావడంతో వామికా మళ్లీ తెలుగులో మరే చిత్రంలో నటించలేదు.

పంజాబీ, హిందీ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించింది వామికా గబ్బి. 2007లో 'జబ్ వి మెట్' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన బ్రేక్ దక్కలేదు.

2023లో 'ఖుఫియా' అనే హిందీ సినిమాతో వామికా బాగా ఫేమస్ అయింది. ఈ చిత్రంలో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. దాంతో ఈ బ్యూటీకి క్రేజ్ కూడా డబుల్ అయ్యింది.

తాజాగా వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన 'బేబీ జాన్' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో వామికా.. టీచర్ పాత్రలో నటించి తన నటనకు గానూ మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక అడివి శేష్ హీరోగా వస్తోన్న 'గూఢచారి -2' సినిమాతో మరోసారి తెలుగులో రీ-ఎంట్రీ ఇవ్వనుంది.





























