- Telugu News Photo Gallery Cinema photos Pranitha Subhash Latest Stunning photos goes viral in social media telugu movie news
Pranitha Subhash: ఈ సొగసరి మెరుపులకు అల్లాడిపోయేను సూర్యుడే.. ప్రణీత స్టన్నింగ్ ఫోటోస్.
సౌత్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో ప్రణీత సుభాష్ ఒకరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన అందమైన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. లైట్ గ్రీన్ కలర్ ట్రెండీ స్టైలీష్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనకు తెలుగులో ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Mar 02, 2024 | 1:47 PM

సౌత్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో ప్రణీత సుభాష్ ఒకరు. బావ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఈ బ్యూటీకి ఆశించినస్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రణీత.

తెలుగు, కన్నడ, తమిళంలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో మరో కథానాయికగా నటించి ఆకట్టుకుంది.

2021లో మే 30న బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది ప్రణీత. వీరికి 2022లో ఆడబిడ్డ జన్మించింది. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రణీత.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో ఓ ఛానల్లో డాన్స్ రియాల్టీ షోకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

అలాగే తమిళంలో థంకమణి సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. సోషల్ మీడియాలో ప్రణీత సుభాష్ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ తన కూతురితో కలిసి ఫోటోస్ షేర్ చేస్తుంది. అలాగే లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన అందమైన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. లైట్ గ్రీన్ కలర్ ట్రెండీ స్టైలీష్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనకు తెలుగులో ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.




