- Telugu News Photo Gallery Cinema photos Prabhas New Movie with Director Hanu Raghavapudi Update here Telugu Heroes Photos
Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి సినిమా స్టోరీ ఇదే.! ఆ మూవీ సీక్వెల్‌లా ఉంటుందని టాక్..
నా రూట్ సెపరేట్‌గా ఉండాలి. అలాగని నలుగురూ నడుస్తున్న దారిని అస్సలు మిస్ చేయకూడదు. అదెలా సాధ్యం తలైవా అంటారా? మనసుండాలే గానీ, అన్నీ సాధ్యమే డార్లింగ్ అని అంటున్నారు మిస్టర్ ప్రభాస్. ఓ వైపు ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని నడుస్తూనే, మరోవైపు తనదైన స్టైల్‌ని సెట్ చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ కెరీర్లో ఏమరుపాటుగా కూడా మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి.
Updated on: Apr 09, 2024 | 10:18 PM

ప్రభాస్ హీరోగా , మారుతీ దర్శకతం లో వస్తున్న రాజా సాబ్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఓ వైపు ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని నడుస్తూనే, మరోవైపు తనదైన స్టైల్‌ని సెట్ చేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ కెరీర్లో ఏమరుపాటుగా కూడా మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఛత్రపతి ది బెస్ట్ ప్లేస్‌లో ఉంటుంది.

డైలాగులు, యాక్షన్, ఎలివేషన్, రొమాన్స్, మదర్ సెంటిమెంట్.. ఒకటేంటి? అన్ని కమర్షియల్ వేల్యూస్‌తో అద్భుతమైన ప్యాకేజ్‌లా ఉంటుంది ఛత్రపతి. అందుకే, ఈ సినిమాను పోలిన సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారట డార్లింగ్.

ఆ టైమ్‌లో ఏమాత్రం తడబడినా, ఆ ఇంపాక్ట్ సినిమా మీద భీభత్సంగా ఉంటుందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. అందుకే ప్రతి ఫ్రేమ్‌ని భూతద్దంలో చూసుకుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సిన అలర్ట్ జోన్‌లో ఉన్నారు నాగ్ అశ్విన్.

ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలు పూర్తి కాగానే సలార్2కి షిఫ్ట్ అవుతారు డార్లింగ్. సలార్ సీక్వెల్ పూర్తవుతున్నప్పుడే , స్పిరిట్‌ని టేకప్ చేస్తారు డార్లింగ్. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే హను రాఘవపూడి సినిమా కూడా చేస్తారన్నది టాక్.

హను.. ఈ ప్రాజెక్టుని పీరియాడిక్ డ్రామాగా డిజైన్ చేశారట. రీసెంట్‌గా హను ఇచ్చిన నెరేషన్ విన్న డార్లింగ్... ఛత్రపతిని మించేలా పేరు తెచ్చుకుంటుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారట.




