- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki 2898 AD Movie Collection 1000 Crore Gross at Box Office Telugu Heroes Photos
“కల్కి”తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించిన రెబెల్ స్టార్ ప్రభాస్
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "కల్కి" వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. దీంతో బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మూవీ చేసిన ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. జూన్ 27న రిలీజైన కల్కి సినిమా కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 1002 కోట్ల రూపాయలు రాబట్టింది.
Updated on: Jul 13, 2024 | 8:58 PM

సాహోరే బాహుబలి అంటూ ఇప్పటికీ హిందీ మార్కెట్‌లో నెంబర్ వన్ కలెక్షన్లున్న సినిమాగా బాహుబలి2నే గౌరవిస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్ నాదేనండీ అంటూ సైలెంట్‌గా కేజీయఫ్2తో ఖర్చీఫ్ వేసేశారు ప్రశాంత్ నీల్.

దీంతో బాహుబలి తర్వాత మరోసారి వెయ్యి కోట్ల మూవీ చేసిన ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.

కాకపోతే సినిమా రిలీజ్‌కి ముందు చేసుకున్న డీల్‌ని బట్టి చాలా వరకు కండిషన్స్ అప్లై అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పరస్పరం మాట్లాడుకుని రీ కన్సిడర్ చేసుకోవడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం.

సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్‌గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసే వారు కొందరైతే, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం.

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లు దక్కాయి. కల్కి సినిమాతో తన స్టార్ డమ్ సత్తా చాటారు ప్రభాస్.

భారీ పాన్ ఇండియా మూవీస్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగల స్టామినా ప్రభాస్ కే సొంతమని చెప్పేందుకు కల్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

కల్కి సాధించిన హిస్టారికల్ సక్సెస్ తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్, హను రాఘవపూడితో ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు.




