Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ జాతకం మార్చేసిన టీజర్
టీజర్ విడుదల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈక్వెషన్స్ మారిపోతున్నాయా..? ఒక్క గ్లింప్స్‌తోనే బయ్యర్ల నుంచి నిర్మాతలకు ప్రెజర్ మొదలైందా..? మొన్నటి వరకు ఉస్తాద్ ఎప్పుడొచ్చినా ఓకే అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు.. ఒక్క గ్లింప్స్‌కే మనసు మార్చుకున్నారా..? ఎన్నికల తర్వాత పవన్ ఆలోచనల్ని ఉస్తాద్ టీజర్ మార్చేయబోతుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన సినిమా టీజర్ ఒక్కటి విడుదలైనా చాలు మళ్లీ మేనియా మొదలైపోతుంది.
Updated on: Mar 22, 2024 | 8:31 PM

లేకుంటే చెప్పిన టైమ్‌కి ల్యాండ్ అవుతారా? అనేది బిగ్ సస్పెన్స్. ఈ ఏడాదే విడుదల చేస్తామని హరిహరవీరమల్లు మేకర్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని కూడా గుర్తుచేసుకుంటున్నారు జనాలు.

పగిలే కొద్దీ గాజు పదునెక్కుద్ది అంటూ పవన్ గెలుపును ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ చేస్తున్నారు పవర్‌స్టార్.

ఎవరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచెను రగిలే రివెంజ్ అంటూ ఓజీ టైమ్ బిగిన్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పవర్‌ఫుల్ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికైతే ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27. ఇప్పుడు పవన్ ఏపీలో మరింత బిజీ కాబట్టి ఈ డేట్ చేంజ్ అవుతుందా?

ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పక్కాగా ఉంది. కుదిర్తే మే.. లేదంటే జూన్ నుంచి ఓజికి డేట్స్ ఇవ్వనున్నారు పవన్. మరో 15 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా అయిపోతుంది. దాన్ని హాయిగా సెప్టెంబర్ 27న విడుదల చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత హరిహర వీరమల్లు లైన్‌లో ఉంది. దాని తర్వాతే ఉస్తాద్ అనుకున్నారు. కానీ టీజర్ తర్వాత ఈక్వెషన్స్ మారిపోయేలా కనిపిస్తున్నాయి.

ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల సంగతుల గురించి మాట్లాడాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే అని నిన్న మొన్నటిదాకా అనుకున్న మాటలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది.




