‘మహానటి, సీతా రామం’ లాంటి హిట్స్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ‘సార్’తో సంచలన విజయం అందుకున్న వెంకీ అట్లూరి దీనికి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి శ్రీమతి గారు అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేసారు.