- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan movies shooting getting breaks due to Elections, how will they to be released
Pawan Kalyan: ఎన్నికల కారణంగా షూటింగ్ కు సడన్ బ్రేక్స్.. మరి పవన్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది
పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు..? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈయన ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? అసలు పవన్ బుర్రలో ఏం తిరుగుతుంది..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారా.. వాటికి డేట్స్ ఇస్తారా..? అవన్నీ కాదంటే ఎలక్షన్స్ అయ్యాకే చూసుకుందాం అంటారా..? ఎన్నికల ప్రభావం పవన్ సినిమాలపై ఏ మేర పడబోతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. పరిస్థితులు చూస్తుంటే బ్రో తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్‌కు లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు. ఒప్పుకున్న సినిమాలు ఫాస్టుగా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు కానీ పరిస్థితులే ఓ పట్టాన సహకరించడం లేదు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 11, 2023 | 2:30 PM

పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు..? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈయన ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? అసలు పవన్ బుర్రలో ఏం తిరుగుతుంది..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారా.. వాటికి డేట్స్ ఇస్తారా..? అవన్నీ కాదంటే ఎలక్షన్స్ అయ్యాకే చూసుకుందాం అంటారా..? ఎన్నికల ప్రభావం పవన్ సినిమాలపై ఏ మేర పడబోతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

పరిస్థితులు చూస్తుంటే బ్రో తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్‌కు లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు. ఒప్పుకున్న సినిమాలు ఫాస్టుగా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు కానీ పరిస్థితులే ఓ పట్టాన సహకరించడం లేదు. ఎప్పటికప్పుడు భారీ షెడ్యూల్స్ చేసేయాలని మెంటల్‌గా ఫిక్సైపోతారు పవన్.. కానీ అప్పుడే పొలిటికల్ సీజన్ షురూ అవుతుంది. తాజాగా ఎన్నికల వేడి బాగా నడుస్తుంది.

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ డే ఉంది. పైగా జనసేన ఇక్కడ 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం పవన్ ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. పూర్తిగా పొలిటికల్ లీడర్ అయిపోయారు జనసేనాని. అందుకే ఇప్పట్లో ఆయన్ని షూటింగ్స్‌లో చూడటం కష్టమే. దర్శక నిర్మాతలు కూడా ఇదే ఫిక్సయ్యారు. అందుకే ఆఫ్టర్ ఎలక్షన్స్ చూసుకుందాం అనుకుంటున్నారు వాళ్లు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కచ్చితంగా ఎన్నికల ముందే ఈ రెండూ రిలీజ్ చేయాలని చూస్తున్నారు పవన్. అదే జరిగితే 2024 సమ్మర్‌లోపే పవన్ నుంచి రెండు సినిమాలు రావడం ఖాయం. చూడాలిక.. ఈ ప్లాన్ అయినా వర్కవుట్ అవుతుందో లేదో..?





























