- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya to do family entertainer next, as he didn't much success in mass type movies
Naga Chaitanya: ఫ్యామిలీ కథల వైపు అడుగులేస్తున్న నాగ చైతన్య.. తన ఓల్డ్ సక్సెస్ మంత్ర కలిసొచ్చేనా ??
బ్యాక్ టూ రూట్స్.. నాగ చైతన్య ప్రస్తుతం నమ్ముకుంటున్న దారి ఇదేనేమో అనిపిస్తుంది. మాస్ సినిమాలు వరసగా హ్యాండిస్తుంటే.. ఈయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? అందుకే అచ్చొచ్చిన ఫ్యామిలీ రూట్‌లోకి వచ్చేస్తున్నారు.. అంతేకాదు కలిసిరాని మరో పర్సనల్ యాంగిల్‌తోనే తన సినిమా కథలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంతకీ చైతూ ఏం చేస్తున్నారు..? ఏంటా కలిసిరాని వ్యక్తిగత కోణం..? ఇదిగో ఇలా హాయిగా కుటుంబ కథా చిత్రాల్లోనే నాగ చైతన్యను ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఇదేదో మనం చెప్పే నోటిమాట కాదు.. ట్రేడ్ చెప్తున్న మాట.
Updated on: Nov 11, 2023 | 1:58 PM

బ్యాక్ టూ రూట్స్.. నాగ చైతన్య ప్రస్తుతం నమ్ముకుంటున్న దారి ఇదేనేమో అనిపిస్తుంది. మాస్ సినిమాలు వరసగా హ్యాండిస్తుంటే.. ఈయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? అందుకే అచ్చొచ్చిన ఫ్యామిలీ రూట్‌లోకి వచ్చేస్తున్నారు.. అంతేకాదు కలిసిరాని మరో పర్సనల్ యాంగిల్‌తోనే తన సినిమా కథలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంతకీ చైతూ ఏం చేస్తున్నారు..? ఏంటా కలిసిరాని వ్యక్తిగత కోణం..?

ఇదిగో ఇలా హాయిగా కుటుంబ కథా చిత్రాల్లోనే నాగ చైతన్యను ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఇదేదో మనం చెప్పే నోటిమాట కాదు.. ట్రేడ్ చెప్తున్న మాట. ఆయన క్లాస్ సినిమాలు చేసినపుడు 90 శాతం హిట్ అందుకున్నారు. అదే మాస్ సినిమాలు చేసినపుడు మాత్రం 10 శాతం మాత్రమే హిట్స్ వచ్చాయి. దాన్నిబట్టి చైతూకు మాస్ సినిమాలు కలిసిరావట్లేదనే విషయం అర్థమైపోతుంది.

మొన్నటికి మొన్న కస్టడీ కూడా అంతే. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం కనీసం మూడ్రోజులు కూడా సరిగ్గా ఆడలేదు. అంత దారుణంగా దెబ్బ తీసింది చైతూ మార్కెట్‌ను.

ఇదొక్కటేనా.. సవ్యసాచి, యుద్ధం శరణం, దడ ఇలా ప్రతీసారి షాకులు తగులుతూనే ఉన్నాయి. అందుకే ఫ్యామిలీ కథల వైపు అడుగేస్తున్నారు చైతూ. తనకు మజిలి లాంటి హిట్టిచ్చిన శివ నిర్వాణతో మరో ఫ్యామిలీ సబ్జెక్ట్‌కు ఓకే చెప్పారీయన.

ఇక చందూ మొండేటితో ఓ సర్వైవల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇందులోనూ ఎమోషన్స్ బలంగా ఉండబోతున్నాయి. సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజుతో చైతూ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. శర్వానంద్, చైతూ మధ్య ఈ కథ ఊగిసలాడుతుంది. విడాకుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. మొత్తానికి మళ్లీ ఫ్యామిలీ కథల వైపు వచ్చేస్తున్నారు అక్కినేని వారసుడు.




