- Telugu News Photo Gallery Cinema photos Prabhas Salaar movie distribution rights going for huge rates, it may be getting 70 crores in Nizam
Salaar: భారీ రేట్ పలుకుతున్న సలార్ రైట్స్ !! ఎంతంటే ??
సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావట్లేదు కానీ.. దాని బిజినెస్ అప్డేట్స్ మాత్రం రోజు ఇస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. మీరు కంగారు పడకండి.. అంతా సవ్యంగానే జరుగుతుంది.. వస్తున్నాం కొడుతున్నాం అంటూ అభిమానులకు హామీ ఇస్తున్నారు. మరి వాళ్ళు ఇస్తున్న ఆ హామీ ఏంటి..? సలార్ బిజినెస్ ఎంతవరకు వచ్చింది.. ఎన్ని రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది.. పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం..? సలార్ సినిమా గురించి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. ఆ సినిమా అప్డేట్స్ కోసం కూడా అలాగే చూస్తున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 11, 2023 | 1:38 PM

సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావట్లేదు కానీ.. దాని బిజినెస్ అప్డేట్స్ మాత్రం రోజు ఇస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. మీరు కంగారు పడకండి.. అంతా సవ్యంగానే జరుగుతుంది.. వస్తున్నాం కొడుతున్నాం అంటూ అభిమానులకు హామీ ఇస్తున్నారు. మరి వాళ్ళు ఇస్తున్న ఆ హామీ ఏంటి..? సలార్ బిజినెస్ ఎంతవరకు వచ్చింది.. ఎన్ని రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది.. పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం..?

సలార్ సినిమా గురించి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. ఆ సినిమా అప్డేట్స్ కోసం కూడా అలాగే చూస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే బిజినెస్ మాత్రం జోరందుకుంటుంది. ఈ డీటెయిల్స్ కూడా ఓపెన్‌గా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు హోంబలే ఫిలిమ్స్. ఒక్కో ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి ట్వీట్ చేస్తున్నారు.

సలార్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఒకవైపు ప్రభాస్, మరోవైపు ప్రశాంత్ నీల్ ఉండడంతో ఎక్కడా తగ్గడం లేదు ఈ సినిమా బిజినెస్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తమిళనాడు, కేరళలోనూ రికార్డ్ బిజినెస్ వైపు అడుగులేస్తుంది సలార్. మలయాళ రైట్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకుంటే.. తమిళ రైట్స్ రెడ్ జెయింట్ ఫిలిమ్స్ తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

కేవలం నైజాంలోనే 70 కోట్ల వరకు సలార్ రైట్స్ పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హిందీలోనూ ఊహకందని బిజినెస్ చేస్తుంది ఈ సినిమా. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్‌కు మంచి కలెక్షన్స్ రావడంతో ప్రభాస్ మార్కెట్ పెరిగింది. అదే ప్రభావం సలార్‌పై కనిపిస్తుంది. ఓవర్సీస్‌లోనూ రికార్డు బిజినెస్ చేస్తుంది ఈ సినిమా. నవంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. డిసెంబర్ 22న రానుంది సలార్.





























