- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan Hara Hara Veera Mallu Movie Release Date Details Here
బందిపోటుగా పవన్ కళ్యాణ్ బీభత్సం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ??
దొరల్ని, నవాబుల్ని, మొఘలు చక్రవర్తిని దోచి పేదలకు పంచిపెట్టడానికి భగవంతుడు పంపిన వీరమల్లు ఏం చేశాడు?.. హరిహర వీరమల్లు పార్ట్ ఒన్ టీజర్ చెప్పింది ఇంతేనా...? అంటే కథాపరంగా ఇంతే.. కానీ టెక్నీషియన్ల పరంగా, విడుదల తేదీ పరంగా మాత్రం ఇంతకు మించి... అదేంటి? చూసేద్దాం రండి... మొన్న మొన్నటిదాకా చడీచప్పుడు లేకుండా ఉన్న హరిహరవీరమల్లు సినిమా తాజాగా టీజర్‌తో ఫ్యాన్స్ లో జోష్ నింపేసింది.
Updated on: May 04, 2024 | 1:35 PM

దొరల్ని, నవాబుల్ని, మొఘలు చక్రవర్తిని దోచి పేదలకు పంచిపెట్టడానికి భగవంతుడు పంపిన వీరమల్లు ఏం చేశాడు?.. హరిహర వీరమల్లు పార్ట్ ఒన్ టీజర్ చెప్పింది ఇంతేనా...? అంటే కథాపరంగా ఇంతే.. కానీ టెక్నీషియన్ల పరంగా, విడుదల తేదీ పరంగా మాత్రం ఇంతకు మించి... అదేంటి? చూసేద్దాం రండి...

మొన్న మొన్నటిదాకా చడీచప్పుడు లేకుండా ఉన్న హరిహరవీరమల్లు సినిమా తాజాగా టీజర్‌తో ఫ్యాన్స్ లో జోష్ నింపేసింది. పవర్‌స్టార్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ టచ్ చేసిన పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా హరిహరవీరమల్లు. 17వ శతాబ్దానికి చెందిన సబ్జెక్టుతో తెరకెక్కుతోందీ సినిమా.

హరిహరవీరమల్లు ఫస్ట్ పార్ట్ కోసం చార్మినార్, రెడ్‌ఫోర్ట్, మచిలీపట్నం ఓడరేవులను ప్రత్యేకంగా సెట్లు వేశారు. ఎక్కడికక్కడ కొత్తదనం కనిపించేలా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దారు. ధర్మం కోసం యుద్ధం అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోంది ఫస్ట్ పార్ట్.

వీరమల్లుగా పవర్‌స్టార్, మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్... ఒకరికి ఒకరు ఏమాత్రం తీసిపోని విధంగా మెప్పించారు. టీజర్‌లో వినిపించిన డైలాగులు వారెవా అనిపించాయి. నేపథ్య సంగీతం ప్రతి షాట్‌కీ ప్రాణం పోసినట్టే అనిపించింది.

ఇవన్నీ ఒక ఎత్తు. దర్శకుడిగా ఇంకొకరి పేరు యాడ్ కావడం మరో ఎత్తు. ఇప్పటిదాకా హరిహరవీరమల్లు అనగానే డైరక్టర్‌గా క్రిష్ పేరు మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ బ్యాలన్స్ ఉన్న షూట్‌ని జ్యోతికృష్ణ డైరక్ట్ చేస్తారట. మిగిలిన షూటింగ్‌కీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులకీ క్రిష్ జాగర్లమూరి పర్యవేక్షణ వహిస్తారట. ఈ విషయాన్ని టీజర్‌తో పాటు అనౌన్స్ చేశారు మేకర్స్. అన్నిటికన్నా ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తున్న మరో విషయం హరిహరవీరమల్లు పార్ట్ ఒన్.. ఈ ఏడాది ఆఖర్లో విడుదలవుతుందని చెప్పడం.




