- Telugu News Photo Gallery Cinema photos Nitin Desai to Sushant Singh Rajput celebrities to dies by suicide after depression
Depression: నితిన్ దేశాయ్ నుంచి సుశాంత్ వరకు.. డిప్రెషన్‌తో తనువు చాలించిన సినిమా సెలబ్రిటీలు వీరే..
సెలబ్రిటీలకు ఎలాంటి బాధలు ఉండవు, హాయిగా జీవితం గడుపుతుంటారు' అని చాలా మంది భావిస్తారు. కానీ అది వాస్తవం అలా కాదు. వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారు కూడా డిప్రెషన్‌కు గురవుతారు . తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్టూడియోలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నితిన్ మాత్రమే కాదు గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సహా పలువురు సినీ ప్రముఖులు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు .
Updated on: Aug 05, 2023 | 9:00 PM

'సెలబ్రిటీలకు ఎలాంటి బాధలు ఉండవు, హాయిగా జీవితం గడుపుతుంటారు' అని చాలా మంది భావిస్తారు. కానీ అది వాస్తవం అలా కాదు. వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారు కూడా డిప్రెషన్‌కు గురవుతారు . తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్టూడియోలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నితిన్ మాత్రమే కాదు గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సహా పలువురు సినీ ప్రముఖులు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు .

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. అయితే అతని మరణానంతరం ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అతను చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని తర్వాత తెలిసింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ ఇంట్లో డిప్రెషన్‌కు సంబంధించిన ట్యాబ్లెట్ దొరికింది.

సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందు, జూన్ 8న, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మలాద్ ఆత్మహత్య చేసుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి దిశా మృతి చెందింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని కూడా చెబుతున్నారు. ఇది జరిగిన వెంటనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించాడు.

జియా ఖాన్ 1988లో జన్మించింది. ‘గజిని’ సినిమాలో నటించి ఫేమస్ అయ్యింది. అయితే 2013, జూన్ 3 న తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది జియా. ఆ తర్వాత ఆమె ఇంట్లో ఆరు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. లేఖలో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలీ పేరు బయటకు వచ్చింది. అయితే జియా కూడా చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడినట్లు సమాచారం.

ప్రముఖ టీవీ సీరియల్ 'బాలికా వధూ'లో ఆనంది పాత్రతో బాగా ఫేమస్ అయ్యింది ప్రత్యూష బెనర్జీ. అయితే 2016 ఏప్రిల్ 1న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఈమె మరణానికి కూడా డిప్రెషన్ కారణమని తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ టీవీ నటి తునీషా శర్మ కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఓ టీవీ సీరియల్ సెట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 21 ఏళ్ల తునీషా డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.




