- Telugu News Photo Gallery Cinema photos Top celebrities react and tweets on shahrukh khan look in jawan movie Telugu Entertainment Photos
Shah Rukh Khan: షారూఖ్ లుక్ పై ప్రముఖుల ట్వీట్స్.. ఆనంద్ మహీంద్ర ఏమ్మన్నారంటే..?
పఠాన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన షారూఖ్ ఖాన్, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ జవాన్ ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్నారు.ఈ సినిమాలో బాద్ షా లుక్ చూసిన వాళ్లు ఆయన ఏజ్ తగ్గిపోతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు టాప్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు.పఠాన్ సక్సెస్ జోష్‌లో ఉండగానే జవాన్ ప్రమోషన్స్ షురూ చేశారు షారూఖ్ ఖాన్.
Updated on: Aug 05, 2023 | 8:59 PM

పఠాన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన షారూఖ్ ఖాన్, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ జవాన్ ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్నారు.ఈ సినిమాలో బాద్ షా లుక్ చూసిన వాళ్లు ఆయన ఏజ్ తగ్గిపోతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు టాప్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు.పఠాన్ సక్సెస్ జోష్‌లో ఉండగానే జవాన్ ప్రమోషన్స్ షురూ చేశారు షారూఖ్ ఖాన్. ఆల్రెడీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.

రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ చూసిన ఆడియన్స్ కింగ్ ఖాన్ రోజు రోజుకు యంగ్‌గా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర కూడా అదే ట్వీట్ చేశారు. షారూఖ్ సాంగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్, ' ఈ హీరో వయసు 57 సంవత్సరాలా!, ఇతని ఏజ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్‌కు రివర్స్‌లో వెళుతుందా?' అంటూ కామెంట్ చేశారు.

ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు బాద్‌షా. 'జీవితం చాలా చిన్నది, ఉన్నంతలో నలుగురికీ సంతోషాన్ని పంచుతూ, ఆనందంగా గడపే ప్రయత్నం చేస్తున్నా' అన్నారు షారూఖ్.

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీతో లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.




