- Telugu News Photo Gallery Cinema photos Nithiin making a movie with Pawan Kalyan's Thammudu title, will it be a boxoffice success
Nithiin: పవన్ ‘తమ్ముడు’ టైటిల్‌తో వచ్చేస్తోన్న నితిన్.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా ??
పవన్ కల్యాణ్ సినిమాల టైటిళ్లకి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ఖుషి టైటిల్‌కి ఉన్న విలువేంటో నాకు తెలుసు. మేం ఆ టైటిల్‌కి గౌరవం తీసుకొస్తామని ఆ మధ్య ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. అలా స్పెసిఫిక్‌గా ఏమీ చెప్పకపోయినా, నేను ఆయనకు ఎప్పటికీ తమ్ముడినే అంటున్నారు నితిన్. ఉన్నట్టుండి పవన్ కల్యాన్ తమ్ముడు సినిమా పేరు సండే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దానికి రీజన్ హీరో నితిన్. పవన్ కల్యాణ్ కి నితిన్ ఎంత పెద్ద ఫ్యానో స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు పవర్ స్టార్ మూవీ టైటిల్ తమ్ముడుని తన సినిమాకు పెట్టుకున్నారు.
Phani CH |
Updated on: Aug 29, 2023 | 7:30 PM

పవన్ కల్యాణ్ సినిమాల టైటిళ్లకి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ఖుషి టైటిల్‌కి ఉన్న విలువేంటో నాకు తెలుసు. మేం ఆ టైటిల్‌కి గౌరవం తీసుకొస్తామని ఆ మధ్య ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. అలా స్పెసిఫిక్‌గా ఏమీ చెప్పకపోయినా, నేను ఆయనకు ఎప్పటికీ తమ్ముడినే అంటున్నారు నితిన్.

ఉన్నట్టుండి పవన్ కల్యాన్ తమ్ముడు సినిమా పేరు సండే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దానికి రీజన్ హీరో నితిన్. పవన్ కల్యాణ్ కి నితిన్ ఎంత పెద్ద ఫ్యానో స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు పవర్ స్టార్ మూవీ టైటిల్ తమ్ముడుని తన సినిమాకు పెట్టుకున్నారు. ఈ మూవీని డైరక్ట్ చేస్తున్నారు శ్రీరామ్‌వేణు. పవర్‌స్టార్ అంటే శ్రీరామ్ వేణుకి స్పెషల్ అభిమానం. వకీల్‌సాబ్ తర్వాత శ్రీరామ్ డైరక్ట్ చేస్తున్న మూవీ తమ్ముడు.

నితిన్ తమ్ముడు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు దిల్‌రాజు. నితిన్ హీరోగా దిల్‌రాజు తెరకెక్కించిన దిల్‌కి టాలీవుడ్‌లో స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ మధ్య సేమ్ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీనివాస కల్యాణం కూడా మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ అయింది.

తమ్ముడు డైరక్టర్ శ్రీరామ్‌వేణుకి కూడా దిల్‌రాజు కాంపౌండ్‌తో మంచి అనుబంధం ఉంది. ఆయన లేటెస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా వకీల్‌సాబ్‌ని నిర్మించింది దిల్‌రాజే. అంతకు ముందు నాని హీరోగా ఎంసీఏ సక్సెస్ ఇచ్చారు శ్రీరామ్ వేణు. ఇప్పుడు సేమ్ బ్యానర్‌లో ముచ్చటగా మూడో సినిమా రూపొందిస్తున్నారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌తో వస్తున్న తమ్ముడు సినిమా సూపర్‌డూపర్ సక్సెస్ కావాలని విషెస్ చెబుతున్నారు పవర్‌స్టార్ ఫ్యాన్స్. సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.





























