అప్పుడెప్పుడో సాహో మూవీ చేశారు డైరక్టర్ సుజీత్. ఆ సినిమాకి సౌత్‌లో మార్కెట్ అంతంతమాత్రమే అనిపించినా, నార్త్ లో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. సాహో సుజీత్ మెగాస్టార్‌తో సినిమా చేస్తున్నారనే మాటలు ఆ మధ్య వినిపించినా, ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ వెయిటింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు సుజీత్. ఇప్పుడు పవర్‌స్టార్ ఓజీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది ఓజీ. వింటేజ్ పవన్ కల్యాణ్‌ని ఫ్యాన్స్ కి గుర్తుచేసే పనిలో యమా బిజీగా ఉన్నారు కెప్టెన్. ఓజీ నుంచి డైరక్ట్ గా ఉస్తాద్ సెట్స్ కి వస్తారు పవన్ కల్యాణ్.