Actress : అబ్బబ్బో.. నిశీధికే చెమటలు పట్టిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. ముఖ్యంగా గ్లామర్ ఫోజులతో రచ్చ చేసింది. దీంతో ఈ హీరోయిన్ కు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాలతో మెప్పించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
Updated on: Sep 01, 2025 | 10:10 PM

తెలుగులో క్రేజీ హీరోయిన్. ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటారని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. గ్లామర్ ఫోజులతో రచ్చ చేసినప్పటికీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

నేహా శెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాధికగా ఫుల్ ఫేమస్ అయ్యింది. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ బ్యూటీగా మారిపోయింది. అప్పటివరకు ఆమె నటించిన సినిమాలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ సిద్ధు జొన్నలగడ్డ జోడిగా డీజే టిల్లు సినిమాతో టాక్ ఆఫ్ టౌన్ గా మారిపోయింది.

డీజే టిల్లు సినిమాలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేసింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించింది. అలాగే టిల్లు స్క్వేర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు సినిమాల్లో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ చేస్తుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. అయితే కొద్ది రోజుల నుంచి నెట్టింట ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. చాలా రోజులుగా ఎలాంటి ఫోటో షేర్ చేయడం లేదు.

తాజాగా ఈ అమ్మడు మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లగా.. అక్కడ ఫోటోస్ అభిమానులతో పంచుకుంది. రాత్రిపూట గ్లామర్ ఫోజులతో నెట్టింట గత్తరలేపుతుంది. తాజాగా మాల్దీవ్స్ రిసార్ట్ లో దిగిన ఎన్నో ఫోటోలను పంచుకుంది. అలాగే మిడ్ నైట్ వాక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.




