- Telugu News Photo Gallery Cinema photos Nayanthara Praises Anil Ravipudi's Work Style: Mega157 Update
Nayanthara: ఆ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిపోతున్న నయనతార
అంత ఈజీగా నయనతార ఏ దర్శకుడిని పొగడరు.. ఇంకా చెప్పాలంటే అసలు సినిమా గురించి కూడా మాట్లాడరు.. తన పని తాను చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంటారు. కానీ తాజాగా నయన్ మనసు గెలుచుకున్నారు ఓ దర్శకుడు.. ఆయన వర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు ఈ బ్యూటీ. ఇలాంటి డైరెక్టర్‌ను ఇన్నాళ్లెలా మిస్ అయ్యానా అంటున్నారు నయన్. మరి ఎవరా దర్శకుడు..?
Updated on: Jul 27, 2025 | 9:37 PM

40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ.

రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండీషన్స్ పెట్టినా.. నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవుతుంటారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్.

ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్‌కు నయనతార ఫిదా అయిపోతున్నారు. అనుకున్న దానికంటే వేగంగా జరుగుతుంది ఈ చిత్ర షూట్. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుడిని ప్రశంసించని నయన్.. అనిల్ రావిపూడికి వర్కింగ్ స్టైల్‌కి పడిపోయారు.

అతన్ని మునగ చెట్టెక్కించేస్తుంది ఈ బ్యూటీ. చెప్పిన టైమ్ కంటే ముందుగానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివి తేటలు చూసి మురిసిపోతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. సంక్రాంతికి మెగా 157 విడుదల కానుంది. గతంలో గాడ్ ఫాదర్, సైరాలో కలిసి నటించారు చిరు, నయన్.

తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ బిజీగా ఉన్నారు నయనతార. ఈమె చేతిలో భారీ సినిమాలున్నాయి. మూకూతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్, హాయ్, రెక్కయి, మన్నంగాట్టి సిన్స్ 1960 లాంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయన్. కానీ ఆ సినిమాలన్నింటి కంటే అనిల్ రావిపూడి సినిమానే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ.




