Sandeep Reddy Vanga: లక్కీ ఛామ్ అయిపోతున్న సందీప్ వంగా
సందీప్ రెడ్డి వంగా లక్కీ ఛామ్ అవుతున్నారా..? ఆయనతో సినిమా చేయడం అటుంచితే.. ఇంటర్వ్యూ చేయాలని మన హీరోలు కలలు కంటున్నారా..? సందీప్ ఇంటర్వ్యూ చేస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అని నమ్ముతున్నారా..? అలా అంటున్నారేంటి అనుకుంటున్నారు కదా..? సాక్ష్యాలుంటే మరి అనకేం చేస్తాం చెప్పండి..? మీరూ చూసేయండి ఇది..
Updated on: Jul 27, 2025 | 9:32 PM

దర్శకులు ఒకప్పట్లా డైరెక్షన్‌తోనే సరిపెట్టుకోవట్లేదిప్పుడు.. చాలా చేస్తున్నారు వాళ్ళు. తమకు ఇష్టమైన హీరోల కోసం అప్పుడప్పుడూ యాంకర్లు కూడా అవుతున్నారు. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది చేసారు.

ఈ లిస్టులో సందీప్ వంగా కూడా చేరిపోయారు.. విడుదలకు ముందు ఈయనతో ఇంటర్వ్యూ సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారు కొందరు హీరోలు. కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి సందీప్ వంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేసారు.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలోనే రానుంది.. గతంలో దేవర సినిమాకు కూడా ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసారు సందీప్.

సందీప్ ఇంటర్వ్యూ చేసిన దేవర బ్లాక్‌బస్టర్.. దానికి ముందు ట్రిపుల్ ఆర్ విడుదల సమయంలో రాజమౌళిని కూడా స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు వంగా. ఇది కూడా బ్లాక్‌బస్టరే.

తాజాగా కింగ్డమ్ సినిమాకు ఇంటర్వ్యూ చేసారు ఈ దర్శకుడు. ఈ లెక్కన సెంటిమెంట్ వర్కౌట్ అయితే.. రౌడీ బాయ్ సినిమా కూడా బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందేమో..? అదే జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు కూడా.




