- Telugu News Photo Gallery Cinema photos Nayani Pavani May Enter Into Bigg Boss 8 As A Contestant Says Reports, Details Here
Bigg Boss 8: బిగ్ బాస్‌లోకి మరోసారి ఆ హాట్ బ్యూటీ.. ఈసారి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కాల్సిందే
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషలలో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటివరకు తెలుగులో 7 సీజన్స్ పూర్తి కాగా.. సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.
Updated on: Aug 05, 2024 | 12:57 PM

బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషలలో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటివరకు తెలుగులో 7 సీజన్స్ పూర్తి కాగా.. సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈలోగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

నెట్టింట వైరలవుతోన్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్‌బాస్ సీజన్ 8 హౌస్‌లోకి యూట్యూబర్ నయని పావని వెళ్లనుందట. గతంలోనే నయని ఒకసారి హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే. సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నయని పావని వారం రోజులకే ఎలిమినేట్ అయ్యింది.

వారం రోజుల్లోనే తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయని పావని ఆకస్మాత్తుగా బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నెట్టింట సీరియస్ అయ్యారు. మరొకరిని కాపాడేందుకే నయనికి అన్యాయం చేశారని.. హౌస్‌లో ఉన్న అబ్బాయిలతో పోటీ పడి మరీ గేమ్ అదరగొట్టిందన్నారు.

అలాంటి అమ్మాయిని వారం రోజులకే కావాలని ఎలిమినేట్ చేశారంటూ మండిపడ్డారు నెటిజన్స్. నయని పావని అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియా ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే ఇప్పుడు సీజన్ 8లోకి మరోసారి నయనిని పంపించనున్నారంటూ టాక్ వినిపిస్తుంది.

ఒకవేళ అదే నిజమైతే ఈసారి నయని పావని టాప్ 5 లో ఉండడం.. లేదా విన్నర్ కావడం ఖాయమంటున్నారు. సోషల్ మీడియాలో నయని పావనికి మంచి ఫాలోయింగ్ ఉంది.




