- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan kalyan OG movie shooting latest update on august 2024 Telugu Heroes Photos
Pawan kalyan: పవన్ మాట లేనిదే రోజు గడవటం లేదుగా.. అటు పాలిటిక్స్, ఇటు మూవీస్..
పవన్ కల్యాణ్ ఫోకస్ మొత్తం పాలన మీదే ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన మాట లేకుండా రోజు అసలు గడవదు. పవర్ స్టామినా అలా ఉంటుంది మరి.. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ఓజీ తో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ ఓజీ అప్‌డేట్ ఏంటి అంటారా.? మాట్లాడుకుందాం వచ్చేయండి.! సుజీత్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఓజీ. ఆ సినిమాను చూద్దురుగానీ అని పవర్‌స్టార్ జనాలను ఊరించారంటేనే, ఆ సబ్జెక్టు మీద ఆయన ఎంత మమకారం పెంచుకున్నారో అర్థం అవుతుంది.
Updated on: Aug 05, 2024 | 11:02 AM

పవన్ కల్యాణ్ ఫోకస్ మొత్తం పాలన మీదే ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన మాట లేకుండా రోజు అసలు గడవదు. పవర్ స్టామినా అలా ఉంటుంది మరి.. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ఓజీ తో ట్రెండ్ అవుతున్నారు.

కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరుచుగా కాదు.. అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడో సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది.

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న హరీష్.. అప్పటికి కాసింత ఖాళీ చేసుకుని, స్క్రిప్ట్ ని మరోసారి సరిచూసుకుని.. రెడీ బాస్ అనడానికి సమయం సరిగ్గా సరిపోతుంది.

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్.

మీ వెనకే మేమూ ఉన్నాం అంటూ హరిహరవీరమల్లు అప్‌డేట్స్ తో సిద్ధమవుతున్నారు మేకర్స్. ఓటీటీ డీల్ ప్రకారం ఈ ఏడాదే విడుదల కావాలి హరిహరవీరమల్లు.

కానీ పరిస్థితుల దృష్ట్యా ఒన్లీ అప్‌డేట్స్ తోనే సరిపెడతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలు రెండూ రిలీజ్ అయ్యాకే ఉస్తాద్ భగత్‌సింగ్ వైపు చూస్తారు పవర్‌స్టార్. ఆ తర్వాత సురేందర్‌రెడ్డి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.




