Saripodhaa Sanivaaram: చెప్పిన డేట్ కి వచ్చేస్తున్నానంటున్న నేచురల్ స్టార్
ఇష్యూ ఏదైనా సరే, మనసులోని మాటలను జెన్యూన్‌గా షేర్ చేసుకుంటారనే పేరుంది నేచురల్ స్టార్ నానికి. సరిపోదా శనివారం ప్రమోషన్లలోనూ ఆయన మాట్లాడిన ఓ విషయం వైరల్ అవుతోంది. ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉన్న ఆ టాపిక్ గురించి నేచురల్ స్టార్ ఏమన్నారు? ఇంతకీ ఆ ట్రెండింగ్ విషయం ఏంటి? చూసేద్దాం రండి... ప్రాజెక్టు చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి క్లారిటీగా మాట్లాడారు నాని.
Updated on: Aug 26, 2024 | 9:04 PM

ఇష్యూ ఏదైనా సరే, మనసులోని మాటలను జెన్యూన్‌గా షేర్ చేసుకుంటారనే పేరుంది నేచురల్ స్టార్ నానికి. సరిపోదా శనివారం ప్రమోషన్లలోనూ ఆయన మాట్లాడిన ఓ విషయం వైరల్ అవుతోంది. ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉన్న ఆ టాపిక్ గురించి నేచురల్ స్టార్ ఏమన్నారు? ఇంతకీ ఆ ట్రెండింగ్ విషయం ఏంటి? చూసేద్దాం రండి...

ప్రాజెక్టు చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి క్లారిటీగా మాట్లాడారు నాని. అసలు క్రేజీ డేట్ల మీద ఖర్చీఫులు ఎలా పడుతున్నాయన్న విషయం మీద తనకున్న అవగాహనను పంచుకున్నారు. తన సరిపోదా శనివారం ఆన్ టైమ్ లో ల్యాండ్ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు నాని

పెద్ద సినిమాలు ఉన్నట్టుండి డేట్లు మార్చేయడం వల్ల, ఆ డేట్‌కి రావాలనుకున్న సినిమాలు రాలేకపోతున్న విషయాన్ని ప్రస్తావించారు నేచురల్ స్టార్. దీని వల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయని చెప్పారు. రీసెంట్‌గా కూడా పుష్ప2 పోస్ట్ పోన్ కావడం వల్ల మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ఆ డేట్‌ని ఆక్యుపై చేశాయి

అత్యంత భారీ సినిమాలు, గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువున్న విషయాల్లో డేట్లు మారితే పరిస్థితిని ఎవరైనా అర్థం చేసుకుంటారని అన్నారు నాని. అలా కాకుండా, ఏదో ఒక క్రేజీ డేట్ ఉందని ఖర్చీఫ్ వేసేయండి అని అనుకునే ధోరణి మాత్రం కరెక్ట్ కాదని చెప్పారు.

సినిమా వర్క్ ఎంత ఉంది? చెప్పిన టైమ్‌కి రాగలమా లేదా? అనే ప్రాక్టికల్ నాలెడ్జి చాలా అవసరమని అన్నారు. అది లేకపోవడం వల్లే ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్లు, నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. తన సినిమాల పరంగా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నట్టు తెలిపారు.




