- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Vs Akkineni, Star Heroes Fight In Tollywood For Dasara
నందమూరి వెర్సస్ అక్కినేని.. దసరాకు స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్.. ఎవరు గెలుస్తారో ??
థియేటర్లలోకి దూసుకుంటూ వచ్చే సినిమాల సంఖ్య ఎంత? అందులో హీరోలెవరు? అనే క్రేజ్ ఎలాగూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు క్లాష్ అయ్యే మూవీస్‌లో నటించే ఆర్టిస్టులను బట్టి కూడా క్రేజ్ యమాగా పెరుగుతుంది. ఈ దసరాకు అలాంటి సీనే థియేటర్లలో కనిపించబోతోంది. నందమూరి హీరోతో ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు అక్కినేని పెద్దోడు... ఇంతకీ సంగతేంటి దేవరా అంటారా? ఆలస్యమెందుకు చూసేద్దాం పదండి... దేవర గ్లింప్స్ చూసినప్పటి నుంచి ఆగలేకపోతున్నారు నందమూరి అభిమానులు.
Updated on: Mar 12, 2024 | 1:49 PM

థియేటర్లలోకి దూసుకుంటూ వచ్చే సినిమాల సంఖ్య ఎంత? అందులో హీరోలెవరు? అనే క్రేజ్ ఎలాగూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు క్లాష్ అయ్యే మూవీస్‌లో నటించే ఆర్టిస్టులను బట్టి కూడా క్రేజ్ యమాగా పెరుగుతుంది. ఈ దసరాకు అలాంటి సీనే థియేటర్లలో కనిపించబోతోంది. నందమూరి హీరోతో ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు అక్కినేని పెద్దోడు... ఇంతకీ సంగతేంటి దేవరా అంటారా? ఆలస్యమెందుకు చూసేద్దాం పదండి...

దేవర గ్లింప్స్ చూసినప్పటి నుంచి ఆగలేకపోతున్నారు నందమూరి అభిమానులు. ఇంకెప్పుడు టైగర్? త్వరగా థియేటర్లలోకి దూసుకువచ్చేయండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఆల్రెడీ అక్టోబర్ డేట్ ఇచ్చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇచ్చిన డేట్ మీట్ కావడం కోసం వర్క్ స్పీడప్ చేశారు కొరటాల శివ.

రెండు పార్టులుగా తీస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. భయం ఎరుగని వారికి భయం పుట్టించే వ్యక్తిగా తారక్ పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ గా ఉంటుందంటూ హింట్స్ అందుతున్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత అన్న వస్తున్నాడు.... దసరా పండగంతా మాదే అంటూ హ్యాపీగా ఉన్నారు తారక్ ఫ్యాన్స్.

దసరా సీజన్‌లో దేవరను ఫాలో అవుతున్నారు తండేల్. అక్లోబర్ 11న తండేల్ విడుదలవుతుందంటూ ఫిల్మ్ నగర్‌లో వార్తలు జోరందుకున్నాయి. ఆల్రెడీ క్రేజ్ ఉన్న నాగచైతన్య, సాయిపల్లవి కాంబో అనగానే సినిమాకు మాంఛి ఊపు వచ్చింది. దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్‌ని ప్రజల్లోకి వదులుతున్నారు మేకర్స్.

ఓ వైపు కుర్రాడి ఉత్సాహం, మరోవైపు అందమైన ప్రేమ, ఇంకో వైపు దేశభక్తి అంటూ ఫుల్ మీల్స్ లా రెడీ అవుతోంది తండేల్. అసలే నందమూరి, అక్కినేని హీరోల మధ్య పోటీ అంటే మన దగ్గర అదో మాదిరి క్రేజ్ ఉంటుంది. ఈ దసరాకు ఆ క్రేజ్ థియేటర్లలో ఏ రేంజ్‌లో కనిపిస్తుందో, చూడాలి మరి..!




