- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Next movies shooting update on august 2024, details here Telugu Heroes Photos
Nandamuri Balakrishna: జోరుమీదున్న నందమూరి బాలయ్య.. 2023 లో బాలయ్య మార్క్ 2025 రిపీట్.!
స్పీడ్ అంటే ఇలాగే ఉండాలి. వెళ్లామా.. పని పూర్తి చేశామా.. వచ్చేశామా? అన్నట్టు.. ఏదైనా ఫటాఫట్‌గా ఉండాలంతే అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. జస్ట్ అనడమే కాదు, యాజ్ ఇట్ ఈజ్‌గా చేసి చూపిస్తున్నారు. 2023ని అసలు మర్చిపోలేరు నందమూరి బాలకృష్ణ. ఇయర్ స్టార్టింగ్‌లో వీరసింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు. ఇయర్ ఎండింగ్‌లో శ్రీలీలకు గార్డియన్‌గా ఉయ్యాలో ఉయ్యాలా అంటూ ఇచ్చిపడేద్దాం అంటూ భగవంత్ కేసరితో ఆకట్టుకున్నారు.
Updated on: Aug 14, 2024 | 7:51 PM

నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నియర్ ఫ్యూచర్‌లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్‌కి తెర లేపినట్టయింది. ఒకరూ, ఇద్దరూ కాదు.. అంతకు మించే.. కెప్టెన్లు వీళ్లిద్దరు ఇచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

జస్ట్ అనడమే కాదు, యాజ్ ఇట్ ఈజ్‌గా చేసి చూపిస్తున్నారు. 2023ని అసలు మర్చిపోలేరు నందమూరి బాలకృష్ణ.

ఇయర్ స్టార్టింగ్‌లో వీరసింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు. ఇయర్ ఎండింగ్‌లో శ్రీలీలకు గార్డియన్‌గా ఉయ్యాలో ఉయ్యాలా అంటూ ఇచ్చిపడేద్దాం అంటూ భగవంత్ కేసరితో ఆకట్టుకున్నారు.

ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా క్లౌడ్‌నైన్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. అయినా సినిమాల షూటింగుల పరంగానూ దూసుకుపోతున్నారు.

లేటెస్ట్ గా జైపూర్‌లో కీ షెడ్యూల్ పూర్తి చేశారు బాలయ్య. త్వరలోనే నందమూరి బాలకృష్ణ సినిమా టైటిల్ టీజర్‌ని రిలీజ్ చేస్తారు మేకర్స్.

ఈసినిమా రిలీజ్ అయ్యీ కాగానే అఖండ సీక్వెల్ సెట్స్ కి వెళ్లాలి బాలయ్య. అయితే అంతకన్నా ముందే కుమారుడు మోక్షజ్ఞతో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.




