- Telugu News Photo Gallery Cinema photos Suriya kanguva movie to release in 35 plus languages on October 10 with makers hoping on universal concept success Telugu Heroes Photos
Kanguva: 35కి పైగా భాషల్లో విడుదల కానున్న కంగువ.! ఆడియన్స్ ని మెప్పిస్తుందా.!
దేవర సినిమా వదిలేసిన అక్టోబర్ 10ని ఫిక్స్ చేసుకుంది సూర్య కంగువ. దేవర లాంటి మాస్ కంటెంట్ కంగువలోనూ ఉందా.? 35కి పైగా భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో యూనివర్శల్ ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఏం ఉంది.? సూర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కంగువ. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిశా పాట్ని హీరోయిన్. బాబీ డియోల్ కీ రోల్‌లో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది.
Updated on: Aug 14, 2024 | 7:26 PM

దేవర సినిమా వదిలేసిన అక్టోబర్ 10ని ఫిక్స్ చేసుకుంది సూర్య కంగువ. దేవర లాంటి మాస్ కంటెంట్ కంగువలోనూ ఉందా.? 35కి పైగా భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో యూనివర్శల్ ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఏం ఉంది.?

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కంగువ. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిశా పాట్ని హీరోయిన్. బాబీ డియోల్ కీ రోల్‌లో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది.

ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ ట్రైలర్‌లో ప్రతి షాట్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆటవిక సమూహాలకు సంబంధించిన కథ అని అర్థమవుతోంది. ఆద్యంతం సరికొత్తగా డిజైన్ చేశారు మేకర్స్.

నీ రక్తమూ నా రక్తమూ వేరువేరా? అని సూర్య చెప్పే డైలాగును బట్టి, ఇది దాయాదుల మధ్య పోరేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ జనాల్లోకి ఇన్‌స్టంట్‌గా వెళ్లడానికి విజువల్స్ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో, అంతకన్నా ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యూజ్ అవుతోంది.

తాజాగా ఈ చిత్ర షూట్ పూర్తైంది. ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తుంది. దీని తర్వాత కమెడియన్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య.

ఇలా ప్రతిదీ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతోంది. థియేటర్లలోనూ ఇదే స్థాయిలో సినిమా కిర్రాక్ అనిపిస్తే కలెక్షన్ల వర్షం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్.




