- Telugu News Photo Gallery Cinema photos Heroine keerthy suresh revils about Kalki 2898 Ad Movie Bujji voice and character for Telugu Entertainment Photos
Kalki 2898 AD: ఒక్కసారిగా మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ.. కీర్తి నే కారణమా.!
కల్కిని ఉన్నపళాన ట్రెండ్‌లోకి తీసుకొచ్చేశారు ముగ్గురు నాయికలు. వారిలో ఒకరు నార్త్ బ్యూటీ.. ఇంకొకరు సౌత్ బ్యూటీ. మరో భామ ప్యాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్. వీరందరికీ డార్లింగ్ ప్రభాస్‌తో మంచి పరిచయం ఉంది. డార్లింగ్‌తో డైరక్ట్ గానూ, ఇన్‌డైరక్ట్ గానూ కలిసి పనిచేశారు. కల్కి 2898ఏడీ అనే పేరు వినగానే ఎవరికి ఏ విషయం గుర్తుకొచ్చినా.. అందరికీ కామన్‌గా గుర్తొచ్చేది మాత్రం ఆ సినిమాలో బుజ్జి కేరక్టర్. బుజ్జి మాట్లాడిన మాటలు.
Updated on: Aug 14, 2024 | 8:40 PM

కల్కిని ఉన్నపళాన ట్రెండ్‌లోకి తీసుకొచ్చేశారు ముగ్గురు నాయికలు. వారిలో ఒకరు నార్త్ బ్యూటీ.. ఇంకొకరు సౌత్ బ్యూటీ. మరో భామ ప్యాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్.

పార్ట్ 1 పూర్తిగా ప్రభాస్ వర్సెస్ అమితాబ్ అన్నట్టుగా సాగింది కథా కథనం. కానీ పార్ట్ 2లో కమల్ కూడా యాడ్ అవుతారు. దీంతో మరింత గ్రాండ్ విజువల్స్, అంతకు మించిన సర్‌ప్రైజ్‌లకు సిద్ధంగా ఉండాలన్న హింట్ ఇస్తోంది కల్కి 2898 ఏడీ మూవీ టీమ్.

వింటున్నారుగా.. కల్కి సినిమాలో ప్రభాస్ తనకి జోకర్‌లా కనిపించారని.. అమితాబ్ బచ్చన్ మాత్రం అద్భుతం అంటూ పొగిడేసారు అర్షద్ వార్షి. ఓ సినిమా నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది కానీ చెప్పే విధానం ఒకటుంటుంది.

అయినా, ఎలాగోలా ప్రాజెక్టులో భాగం కావాలని అనుకున్నారట. ఆ విషయమే చెబితే, బుజ్జి రోల్‌కి వాయిస్ ఇవ్వమని బంపర్ ఆఫర్ ఇచ్చారట. యాహూ అంటూ ప్రాజెక్టును ఓకే చేసేశానని అంటున్నారు కీర్తీ.

సౌత్ నుంచి కీర్తీ సురేష్ కల్కి గురించి మాట్లాడుతుంటే, నార్త్ నుంచి ఈ బాధ్యతను శ్రద్ధాకపూర్ తీసుకున్నారు. స్త్రీ2తో ఆగస్టు 15న ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.

మరో నాలుగైదు నెలల్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫార్మ్ చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 20 కోట్లకు పైగా వసూళ్లొచ్చాయట. డే ఒన్ కలెక్షన్లు కూడా ప్రీవియస్ రికార్డులను క్రాస్ చేసేస్తాయనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అన్నట్టు... స్త్రీ2లో తమన్న చేసిన స్పెషల్ సాంగ్‌కి కూడా మంచి క్రేజ్ ఉంది.




