- Telugu News Photo Gallery Cinema photos Committee Kurrollu Movie Fame Actress Vishika Glamorous Photos Goes Viral
Actress Vishika : ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమలో పద్మ క్యారెక్టర్ హీరోయిన్ గురించి తెలుసా..? ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటంటే..
కమిటీ కుర్రాళ్లు.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా. చిన్న మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో పదకొండు మంది కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో మరో హీరోయిన్ విషిక అందరి దృష్టిని ఆకర్షించింది.
Updated on: Aug 14, 2024 | 10:21 PM

కమిటీ కుర్రాళ్లు.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా. చిన్న మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో పదకొండు మంది కొత్త హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో మరో హీరోయిన్ విషిక అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సినిమాలో పద్మా అనే క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్ ప్రేక్షకులందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ పాత్రలో నటించిన ఈ హీరోయిన్ పేరు విషిక. కానీ ఆమె అసలు పేరు కీర్తి. కాకపోతే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు విషికగా తన పేరు మార్చుకుంది. ఈ బ్యూటీ అచ్చ తెలుగమ్మాయి.

తెలుగమ్మాయి అయినా ఒడిశ్సాలో పుట్టి పెరిగింది. వృత్తి రిత్యా తన ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అవ్వడంతో అక్కడే ఈ ముద్దుగుమ్మ బీటెక్ వరకు చదువుకుంది. ఇదిలా ఉంటే విషికకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కమిటి కుర్రాళ్లు సినిమాకు పలు చిత్రాల్లో నటించింది. కాకపోతే అవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్స్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు. 2019లో ఎమోషనల్ ఫుల్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత పరువు, పరంపర అనే వెబ్ సిరీస్ చేసింది. వీటితోపాటు లావణ్య త్రిపాఠి నటించిన హ్యాపీ బర్త్ డే చిత్రంలో నటించింది. ప్రస్తుతం కమిటీ కుర్రాడు సినిమాతోపాటు పాగల్ వర్సెస్ కాదల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.

త్వరలో పతంగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది. కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఎంతో పద్దతిగా కనిపించిన విషిక.. బయట మాత్రం చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్యూటీఫుల్ గ్లామరస్ ఫోటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.




