- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna manage politics and movies at AP elections time 2024 pawan kalyan follows balakrishna Telugu Heroes Photos
Balakrishna: అటు పొలిటికల్ గ్రౌండ్‌లో ఇటు కెమెరా ముందు రెండు బ్యాలెన్స్ చేస్తున్న బాలయ్య , పవన్.
తెలంగాణలో అసెంబ్లీ వేడి వేడిగా జరుగుతుంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల గురించి గరమ్ గరమ్ డిస్కషన్స్ షురూ అయ్యాయి. పొలిటికల్ హీట్‌కి, ఇప్పుడు సినీ గ్లామర్ తోడవుతోంది. ఈ సారి ఎన్నికల్లో అటు పవన్, ఇటు బాలయ్య అంటూ స్టార్ హీరోల హంగామా గట్టిగానే కనిపించబోతోంది. రాజకీయాల మీద దృష్టి పెట్టడం కోసం కొన్నాళ్ల పాటు సినిమాలకు కామా పెట్టేశారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.
Updated on: Feb 19, 2024 | 2:20 PM

తెలంగాణలో అసెంబ్లీ వేడి వేడిగా జరుగుతుంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల గురించి గరమ్ గరమ్ డిస్కషన్స్ షురూ అయ్యాయి. పొలిటికల్ హీట్‌కి, ఇప్పుడు సినీ గ్లామర్ తోడవుతోంది.

ఈ సారి ఎన్నికల్లో అటు పవన్, ఇటు బాలయ్య అంటూ స్టార్ హీరోల హంగామా గట్టిగానే కనిపించబోతోంది. రాజకీయాల మీద దృష్టి పెట్టడం కోసం కొన్నాళ్ల పాటు సినిమాలకు కామా పెట్టేశారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.

ఆయన పొలిటికల్ గ్రౌండ్‌లో బిజీగా ఉంటే, ఆయన ప్రాజెక్టుల మేకర్స్ మాత్రం ఏదో రకంగా అప్‌డేట్ ఇస్తూ, ఫ్యాన్స్ లో జోష్ నింపడానికే ట్రై చేస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది ఓజీ.

మీరెవ్వరూ ఊహించని విధంగా స్క్రీన్ మీద మా సందడి ఉంటుందని సౌండ్ చేసింది హరిహరవీరమల్లు. పవన్ మాత్రం పాలిటిక్స్ లో బిజీ. అయితే ఇప్పుడు ఇదే రూట్లో ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ.

ఆయన హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా కీ సీన్స్ కూడా షూట్ చేశారట బాబీ. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, టూ మంత్స్ షూటింగులకు బ్రేక్ తీసుకోవాలన్న ప్లానింగ్‌లో ఉన్నారు బాలయ్య.

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పూర్తయ్యాక, బాబాయ్ బాలయ్య ఫ్రెష్ గా కమ్‌బ్యాక్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అప్పుడు అఖండ సీక్వెల్ పనులతో బిజీ అవుతారట.

అంతలో బాబీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, అఖండ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవుతాయి. ఫ్యాన్స్ కి ఈ రెండు సినిమాల నుంచి ఏదో అప్‌డేట్ వస్తూనే ఉంటుంది.




