Sukumar – Pushpa 2: ఆర్య నుంచి పుష్ప 2 వరకు సుకుమార్ కు తప్పని ఐటెం సాంగ్ తిప్పలు.!
ఆర్య నుంచి పుష్ప వరకు 90 శాతం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. పైగా సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, DSP కాంబినేషన్‌కు తిరుగులేదు. ఆర్య, ఆర్య 2, పుష్పలో పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. పుష్ప 2లో ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసింది. పుష్ప 2 పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.