- Telugu News Photo Gallery Cinema photos Mythri Movie Makers are making films in all languages and focusing on Pan India
Mythri Movie Makers: పాన్ ఇండియాపై ఫోకస్.. అన్ని భాషల్లో మైత్రి జండా..
పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా.. మేం కాదా అంటున్నారు నిర్మాతలు. అందుకే అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ పట్టు సాధించాలని చూస్తుంది. తమిళం, మలయాళంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది. ఇంతకీ ఎవరా నిర్మాతలు..?
Updated on: Mar 17, 2024 | 8:33 AM

దిల్ రాజు ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్, అశ్వినీ దత్ లాంటి వాళ్లు ఎప్పుడో చేసారిది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ నిర్మాణాన్ని పక్క ఇండస్ట్రీల వైపు విస్తరిస్తున్నారు. శ్రీమంతుడుతో మొదలైన మైత్రి ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియన్ వైపు అడుగులు వేస్తుంది.

తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప 2 ది రూల్, రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16 సహా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా తమిళ, మలయాళంపై ఫోకస్ కదా చేసారు మైత్రి నిర్మాతలు.

ఇప్పటికే మలయాళంలో అదృశ్య జలకంగల్ సినిమాను నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్. టోవినో థామస్ ఇందులో హీరో. ఇక తమిళంలో అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్.

అజిత్ సినిమాను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు హిందీలోనూ ఈ మద్యే ఫర్రే సినిమాను నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్.

అక్కడా వరస ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు మైత్రి. మొత్తానికి అన్ని ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తూ.. అసలు సిసలైన పాన్ ఇండియన్ నిర్మాతలు అనిపించుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ యేర్నేని, రవిశంకర్.




