- Telugu News Photo Gallery Cinema photos Music Director Devi Sri Prasad Upcoming Movies List Increase after long gap Telugu Heroes Photos
Devi Sri Prasad: చాలా రోజుల తర్వాత దేవి శ్రీ ప్రసాద్ జోరు.! లిస్ట్ పెరిగినట్టేనా.?
ఏదేమైనా దేవీ శ్రీ ప్రసాద్‌లో జోరు తగ్గిపోయిందబ్బా.. మునపట్లా ఇప్పుడు ఆయనలో పస లేదు.. రేసులో కూడా వెనకబడిపోయాడు.. ఇదిగో ఇవే దేవీ గురించి బయట నడుస్తున్న టాక్. కానీ DSP ప్లానింగ్ మరోలా ఉంది. రేసులో రెండు అడుగులు వెనక్కి వేసేది.. ముందుకు దూకడానికే అంటున్నారీయన. మరి ప్రస్తుతం దేవీ ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? మునపట్లా మళ్లీ నెంబర్ వన్ ప్లేస్‌కు వస్తారా..?
Updated on: Mar 16, 2024 | 7:41 PM

ఏదేమైనా దేవీ శ్రీ ప్రసాద్‌లో జోరు తగ్గిపోయిందబ్బా.. మునపట్లా ఇప్పుడు ఆయనలో పస లేదు.. రేసులో కూడా వెనకబడిపోయాడు.. ఇదిగో ఇవే దేవీ గురించి బయట నడుస్తున్న టాక్. కానీ DSP ప్లానింగ్ మరోలా ఉంది. రేసులో రెండు అడుగులు వెనక్కి వేసేది.. ముందుకు దూకడానికే అంటున్నారీయన.

మరి ప్రస్తుతం దేవీ ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? మునపట్లా మళ్లీ నెంబర్ వన్ ప్లేస్‌కు వస్తారా..? తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. తన పేరు కాకుండా మరో పేరు చెప్పలేని స్థాయిలో చాలా ఏళ్ళు పాటు మ్యూజికల్ మ్యాజిక్ చేసారు దేవీ శ్రీ ప్రసాద్.

కానీ ఆ జోరు.. స్క్రీన్ మీద దేవీ పేరు మునపటిలా కనిపించట్లేదు.. పాటలు కనిపించట్లేదు. ఎవరొప్పుకున్నా లేకున్నా ఇదే నిజం. 2023లో కేవలం వాల్తేరు వీరయ్యకు మాత్రమే సంగీతం అందించారు దేవీ.

ఇదే సమయంలో థమన్, అనిరుధ్ వరస సినిమాలు చేస్తున్నారు. అయితే 2024 మాత్రం అలా ఉండదంటున్నారు దేవీ. గ్యాప్ తీసుకున్నా కూడా.. గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు.

ఓ వైపు పుష్ప 2.. మరోవైపు చందూ మొండేటి తండేల్.. ఇంకోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల కుబేరా.. విశాల్ రత్నం లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2, తండేల్, కుబేరా అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే.

వీటిపై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూర్య కంగువా సైతం దేవీ చేతిలోనే ఉన్నాయి.

తాజాగా అజిత్, ఆధిక్ రవిచంద్రన్ కాంబోలో ప్రకటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు DSPనే సంగీత దర్శకుడు. వీటితోనే పోయిన తన టాప్ ప్లేస్ దక్కించుకోవాలని చూస్తున్నారు దేవీ. చూడాలిక.. ఏం జరగబోతుందో..?




