బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో సినిమాలు చేయడం చాలా కామన్. ఇలా చాలా మంది హీరోయిన్ తెలుగులో నటించి ఇక్కడ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అందాల భామ మృణాల్ ఠాకూర్ ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. అంతకు ముందు బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించింది. అలాగే అక్కడ జెర్సీ సినిమాతో హీరోయిన్ అయ్యింది.