Mrunal Thakur: తెలుగులో సీతకు క్యూ కడుతున్న ఆఫర్స్.. టాలీవుడ్లో మృణాల్ బిజీ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బిజీ హీరోయిన్లలో మృణాల్ ఠాకుర్ ఒకరు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో బిజీగా కథానాయికగా కొనసాగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సీతారామం సినిమాతో తెలుగు తెరకు సీతామహలక్ష్మిగా పరిచయమైంది మృణాల్. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన తన నటనతో మంత్రముగ్దులను చేసింది. దీంతో అడియన్స్ హృదయాల్లో సీతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.