- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 7 Telugu They are the ones who cut the beautiful hair in the bigg boss house 2nd season to t season telugu cinema news
Bigg Boss Season 7 Telugu: బిగ్‌బాస్ కోసం ఇలాంటి త్యాగాలు తప్పదు మరి.. హౌజ్లో అందమైన కురులను కత్తిరించుకున్నది వీరే..
బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పుడు ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఉంది. మొదటి నుంచి ఉన్న సీజన్లకు భిన్నంగా సీజన్ 7 ఉంటుందని.. అడియన్స్ ఊహలకు మించి.. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ముందు నుంచి అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున. ఇక ప్రోమోలతో చెప్పినట్లుగానే ఈసారి సీజన్ అంతా ఉల్టా పుల్టా. ఇప్పుడిప్పుడే ఇంట్లో స్ట్రాంగ్ కంటెండర్స్ అయ్యేందుకు గట్టి పోటీ జరుగుతుంది. కానీ ఎన్ని చెప్పినా కొన్ని సెంటిమెంట్లను మాత్రం బిగ్‌బాస్ వదలడం లేదు.
Updated on: Sep 22, 2023 | 9:26 PM


బిగ్‌బాస్ సీజన్ 7 ఇప్పుడు ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఉంది. మొదటి నుంచి ఉన్న సీజన్లకు భిన్నంగా సీజన్ 7 ఉంటుందని.. అడియన్స్ ఊహలకు మించి.. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ముందు నుంచి అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున.

మొదటి నుంచి ఇప్పుడు సీజన్ 7 వరకు ఈ సెంటిమెంట్ కొనసాగుతున్నాడు. అయితే ఫస్ట్ సీజన్ లో మాత్రం ఈ సెంటిమెంట్ లేదు. ఇక ఆ తర్వాత సీజన్ 2లో య్యూబర్ దీప్తి సునయనతో ఈ జుట్టు కత్తిరించే టాస్క్ స్టార్ట్ చేశాడు.

ఆ తర్వాత మూడో సీజన్ లో యాంకర్ శివజ్యోతి జుట్టు కత్తిరించుకుంది. మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో శివజ్యోతి తన జుట్టును చెవుల వరకు తానే స్వయంగా కట్ చేసుకుంది.

ఇక సీజన్ 4లో యూట్యూబర్ దేత్తడి హారిక తన జుట్టును త్యాగం చేసింది. అయితే ఇప్పటివరకు అమ్మాయిలు మాత్రమే తమ జుట్టును త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు.

అలాగే 5వ సీజన్ లో మాత్రం అమ్మా రాజశేఖర్ మాస్టర్ తన జుట్టును త్యాగం చేశారు. ఆ తర్వాత ఆరో సీజన్ లో వాసంతి జుట్టును కట్ చేసుకుంది. అయితే ఇప్పటివరకు తమ జట్టును కట్ చేసుకున్న ఓ ఒక్కరు టైటిల్ గెలవలేదు.

దీంతో ఇప్పుడు సీజన్ 7లో జుట్టు కట్ చేసుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్కు అదే టెన్షన్ పట్టుకుంది. అమర్ దీప్, ప్రియాంకకు ఇచ్చిన టాస్కులో అమర్ వెనక్కు వెళ్లగా జుట్టు త్యాగం చేసి కంటెండర్ పోటీకి సిద్ధమయ్యింది ప్రియాంక.





























