- Telugu News Photo Gallery Cinema photos Movies like janaka aithe ganaka, committee kurrollu, aay getting success with different content
చిన్న సినిమాలను కాపాడుతున్న వెరైటీ కంటెంట్.. ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న సక్సెస్ ఫార్ములా ఇదే
సినిమా చిన్నదైతే, కాన్సెప్ట్ పెద్దగా ఉండాలనేది ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న ఫార్ములా. రీసెంట్‌గా సక్సెస్ అయిన సినిమాలను చూస్తే ఈ విషయమే మరోసారి కన్‌ఫర్మ్ అవుతుంది. సెన్సిటివ్ విషయాలను అంతే సున్నితంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయితే సినిమా హిట్ అయినట్టే అనే మాట పదే పదే వినిపిస్తోంది. జనక అయితే గనక.. పిల్లలను కని, పెంచడం అంటే కోటి రూపాయల వ్యవహారం అనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.
Updated on: Aug 31, 2024 | 12:42 PM

సినిమా చిన్నదైతే, కాన్సెప్ట్ పెద్దగా ఉండాలనేది ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న ఫార్ములా. రీసెంట్‌గా సక్సెస్ అయిన సినిమాలను చూస్తే ఈ విషయమే మరోసారి కన్‌ఫర్మ్ అవుతుంది. సెన్సిటివ్ విషయాలను అంతే సున్నితంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయితే సినిమా హిట్ అయినట్టే అనే మాట పదే పదే వినిపిస్తోంది.

జనక అయితే గనక.. పిల్లలను కని, పెంచడం అంటే కోటి రూపాయల వ్యవహారం అనుకునే మిడిల్ క్లాస్ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇంతకీ ఈ సినిమా జస్ట్ ఆ టాపిక్‌తోనే ఆగిందా? అంతకు మించి ఇంకేమైనా ఉందా...

ట్రైలర్ ఎండింగ్‌లో చూపించిన ఈ పార్టు కూడా చూసేయండి... ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అదీ వ్యవహారం... తెలుగు స్క్రీన్ మీద ఇప్పటిదాకా రాని సెన్సిబుల్ కంటెంట్‌తో తెరకెక్కుతోంది జనక అయితే గనక.

రీసెంట్‌గా పంద్రాగస్టుకి రిలీజ్ అయిన ఆయ్ సినిమాలో స్నేహం అనే కాన్సెప్ట్ ఎంత బాగా కనిపించిందో, కులాల గురించి ప్రస్తావన కూడా అంతే బాగా వినిపించింది.

ఆయ్ సక్సెస్‌లోనే కాదు, అంతకు ముందు వారం రిలీజ్ అయి సక్సెస్ అయిన కమిటీ కుర్రాళ్లు సినిమా సక్సెస్‌లోనూ సేమ్ టాపిక్ రిఫ్లెక్ట్ అయింది. సో... సినిమా చిన్నదైనప్పుడు, థియేటర్లకు జనాలను పుల్ చేయాలంటే వెరైటీ కంటెంట్ కచ్చితంగా ఉండాలనే విషయం రీసెంట్ టైమ్స్ లో మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతోందన్నమాట.




