- Telugu News Photo Gallery Cinema photos Ott platforms are interested to take low and high budget movies
అలాంటి సినిమాలను పోటీపడి తీసుకుంటున్న ఓటీటీ సంస్థలు !!
పెద్ద సినిమాలకూ ఇబ్బంది లేదు.. చిన్న సినిమాలకూ ఇబ్బంది లేదు... అసలు వాటికి పనిచేసే వారికీ, వాటిని విడుదల చేసే వారికీ ఇబ్బంది లేదు. కానీ, ఎటొచ్చీ.. మీడియం రేంజ్ సినిమాలున్నాయే... వాటితోనే ఇబ్బంది అంతా... అమ్మాలన్నా, కొనాలన్నా, ఒకవేళ సినిమా ఫలితం తేడాగా వస్తే కోలుకోవాలన్నా... ప్రతి దానికీ ఇబ్బందే మరి... స్టార్ హీరోల సినిమాలకు, ప్యాన్ ఇండియా సినిమాలకూ కళ్లుమూసుకుని కోట్లు కుమ్మరించినా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనో
Updated on: Aug 31, 2024 | 12:29 PM

అది చాలా భారీ సినిమా. రెండు, మూడు సినిమాలకు ఎంత కష్టపడతానో, కల్కి2కి అంత శ్రమ చేయాలి. అందుకే కాస్త సమయం పడుతుందన్నది నాగీ చెప్పిన మాట.

అంతేకాదు సీక్వెల్‌లో దీపిక క్యారెక్టర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. కొన్ని సీన్స్‌లో ఆమె తల్లిగా కనిపిస్తారని చెప్పారు. దీంతో పార్ట్ 2లో కల్కి కూడా కనిపిస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్.

చిన్న సినిమాల విషయంలో ప్రీ రిలీజ్ బజ్ పెద్దగా లేకపోయినా, మౌత్ టాక్ చూసి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంట్రస్టుగా హక్కులు తీసుకుంటున్నాయి. పెట్టిన ఖర్చు కూడా పెద్దగా ఉండదు కాబట్టి, నిర్మాతలు కూడా హాయిగా లాభాలను చూసేయగలుగుతున్నారు.

మేకర్స్ ఎటొచ్చీ ఇబ్బందులు పడుతున్నది మాత్రం మీడియం రేంజ్ సినిమాలతోనే. కాంబినేషన్లనూ, కటౌట్లనూ నమ్మి కోట్లు పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది మీడియం రేంజ్ ప్రాజెక్టులకు. కంటెంట్ ఏమాత్రం అటూ ఇటూ ఉన్నా, ఫ్లాప్ టాక్ కలవరపెట్టేస్తోంది మేకర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని.

పెట్టిన డబ్బు రాక... ఓటీటీలు ముందు చెప్పిన రేట్లకు తీసుకోవడానికి ముందుకు రాక... థియేటర్లలో ఫుట్ ఫాల్ లేక.. రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది మీడియం రేంజ్ ప్రాజెక్ట్స్. అందుకే క్రేజీ డేట్ల మీద కాకుండా, కంటెంట్ మీద ఫోకస్ చేసి, బడ్జెట్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే ఈ ఇబ్బందుల నుంచి మేకర్స్ ఓ మోస్తరుగానైనా బయటపడవచ్చనే హింట్స్ అందుతున్నాయి.




