ఈ డిసెంబర్ మునుపటిలా ఉండదు. అనూహ్మమైన రీతిలో ఉంటుందని ప్రశాంత్ నీల్ భార్య చేసిన కామెంట్, ఆ మధ్య సలార్ ఆగమనం గురించి హింట్ ఇచ్చింది. ఆ హింట్‌ని నిజం చేస్తూ సలార్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 22న రావడం పక్కా అని ఢంకా భజాయించి చెప్పేశారు డార్లింగ్. సలార్ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ కాగానే, ఈ సినిమాలో యష్ ప్రెజెన్స్ గురించి ఆరా తీస్తున్నారు రాక్‌స్టార్ అభిమానులు.