- Telugu News Photo Gallery Cinema photos Mollywood Hero Prithviraj Sukumaran next crazy projects in Tollywood and Bollywood Telugu Heroes Photos
Prithviraj Sukumaran: అన్ని వుడ్‌లకు ఒకే గెస్ట్.. ఏలేస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్.
లాంగ్వేజ్ ఏదైనా పాన్ ఇండియా సినిమా అంటే ఆయన గెస్ట్ అపియరెన్స్ ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్. మాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా పరిచయం అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ తరువాత దర్శకుడిగానూ తన మార్క్ చూపించారు. మాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న పృథ్వీరాజ్ ఇతర భాషల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే మల్టీ లింగ్యువల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్, అప్పట్లోనే బాలీవుడ్ సినిమాల్లో తళుక్కుమన్నారు.
Updated on: Oct 24, 2023 | 8:05 PM

లాంగ్వేజ్ ఏదైనా పాన్ ఇండియా సినిమా అంటే ఆయన గెస్ట్ అపియరెన్స్ ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్. మాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా పరిచయం అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ తరువాత దర్శకుడిగానూ తన మార్క్ చూపించారు.

మాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న పృథ్వీరాజ్ ఇతర భాషల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే మల్టీ లింగ్యువల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్, అప్పట్లోనే బాలీవుడ్ సినిమాల్లో తళుక్కుమన్నారు.

కోవిడ్ టైమ్ లో డబ్బింగ్ సినిమాలతో అన్ని ఇండస్ట్రీలకు చేరువైన పృథ్వీరాజ్ సుకుమారన్ కు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్.

ఈ సినిమాలో జగపతి బాబు కొడుకు పాత్రలో విలన్ గా కనిపించబోతున్నారు. హీరోగా సూపర్ ఫామ్ లో ఉన్న టైమ్‌లోనే నెగెటివ్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నార్త్ సినిమాలు చేసిన పృథ్వీరాజ్, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో నార్త్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బడే మియా చోటే మియా సినిమాలోనూ గెస్ట్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పృథ్వీరాజ్. ఈ సినిమాతో మరోసారి నార్త్ మార్కెట్ లో తన జోరు చూపించాలని పిక్స్ అయ్యారు.

తాజాగా కోలీవుడ్ లోనూ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు పృథ్వీరాజ్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం పృథ్వీరాజ్ ను సంప్రదించింది చిత్రయూనిట్.

సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అది కూడా లోకేష్ లా సూపర్ ఫామ్‌లో ఉన్న దర్శకుడితో మూవీ కావటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశారట పృథ్వీరాజ్. ఇంత బిజీగా ఇన్ని భాషల్లో సినిమాలు చేస్తూ కూడా దర్శకుడిగానూ తన మార్క్ చూపిస్తున్నారు పృథ్వీరాజ్.

ఆల్రెడీ సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు పృథ్వీరాజ్. ఈ సినిమాతో దర్శకుడిగానూ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు.




