- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi New Photos Goes attractive in Social media on 21 08 2023 Telugu Heroes Photos
Megastar Chiranjeevi: వారెవ్వా బాస్..! కొత్త లుక్ తో యంగ్ హీరోస్ కు పోటీ ఇస్తున్న చిరు..
మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేశారు. ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ చూసినవాళ్లు ఆయనకు 67 ఏళ్లంటే నమ్మలేరు. ఇటీవల మరింత స్లిమ్ గా మారిన చిరు, కుర్రాళ్లకు దీటుగా తన ఫిట్‌నెస్ కాపాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.ఈ సందర్బంగా తాజాగా చిరంజీవి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Updated on: Aug 21, 2023 | 10:47 AM

మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’గా పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్ జోష్‌లో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేశారు. ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ చూసినవాళ్లు ఆయనకు 67 ఏళ్లంటే నమ్మలేరు.

ఇటీవల మరింత స్లిమ్ గా మారిన చిరు, కుర్రాళ్లకు దీటుగా తన ఫిట్‌నెస్ కాపాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.ఈ సందర్బంగా తాజాగా చిరంజీవి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

షర్టు, ప్యాంటు, చేతికి వాచీ, కాళ్లకు హాఫ్ షూ ధరించిన మెగాస్టార్ జెంటిల్మన్ లుక్ లో సింపుల్ గా దర్శనమిచ్చారు.

ఎంతో కూల్ గా ఉన్న ఈ పిక్స్ అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చిన చిరంజీవి..

ఖైదీ నెం.150తో రీఎంట్రీ ఇచ్చారు. అక్కడ్నించి ఆయన స్పీడు మామూలుగా లేదు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య...

ఇప్పుడు భోళాశంకర్ తో అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తున్నారు. త్వరలో సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాలతో చిరంజీవి ఓ చిత్రం చేయబోతున్నారు.




