- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi may do a films in srikanth odela and ani ravipudi direction
Chiranjeevi: మాస్ డైరక్టర్‌స్‌కు స్ట్రెయిట్ ఆఫర్ ఇవ్వనున్న మెగాస్టార్..
ఓవైపు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా విశ్వంభర షూటింగ్ పూర్తి చేస్తున్నారు వశిష్ట. దాంతో చిరంజీవికి ఇంకో దర్శకుడు కావాలిప్పుడు. లేదంటే అనవసరంగా టైమ్ వేస్ట్ అయిపోతుంది. అలాగని రీమేక్‌లకు నో అంటున్నారు మెగా స్టార్. ఈ టైమ్‌లో ఓ కుర్ర దర్శకుడు చిరంజీవిని మెప్పించి.. స్ట్రెయిట్ ఆఫర్ అందుకున్నారని తెలుస్తుంది. మరి ఆయనెవరు..?
Updated on: Dec 07, 2024 | 2:31 PM

యంగ్ జనరేషన్‌తో పోటీ పడాలంటే యంగ్ టీమ్‌తో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకే వరుసగా కుర్ర దర్శకులతో సినిమాలు లైన్‌లో పెడుతున్నారు.

విశ్వంభర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. సంక్రాంతి నుంచి తప్పుకుంది కానీ లేదంటే ఈ పాటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసేవారు దర్శకుడు వశిష్ట. చూస్తుంటే ఫిబ్రవరిలోపే విశ్వంభర నుంచి చిరు ఫ్రీ అయ్యేలా కనిపిస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోయినా... యంగ్ టీమ్‌తోనే వర్క్ చేయాలన్న డెసిషన్‌కే ఫిక్స్ అయ్యారు చిరు.

మెగా స్టార్ చిరంజీవి స్టైల్ మార్చారు. గతంలో సీనియర్ దర్శకులు, తనకు బాగా సింక్ అయిన టెక్నీషియన్స్‌తోనే వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించిన చిరు, ఇప్పుడు డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అనిల్ రావిపూడితో సినిమా ఉండబోతుంది. 2024 సమ్మర్‌లో ఇది సెట్స్‌పైకి వచ్చే అవకాశముంది. దీని తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. నానితో తెరకెక్కిస్తున్న పారడైజ్ తర్వాత.. మెగా ప్రాజెక్ట్ టేకప్ చేయనున్నారు ఓదెల.




