చిరుతో నటిస్తే హిట్ పక్కా అంటున్న టాలీవుడ్ టాప్ బ్యూటీస్
మెగాస్టార్ చిరంజీవిని ఆపద్భాందవుడిగా చూస్తున్నారు అప్ కమింగ్ సినిమాల హీరోయిన్స్. ప్రజెంట్ చిరుకు జోడీగా నటిస్తున్న బ్యూటీస్, ఆ సినిమాలతో కెరీర్లో బిగ్ చేంజ్ వస్తుందని ఆశపడుతున్నారు.. ఇంతకీ చిరంజీవి మీద ఈ రేంజ్ ఆశలు పెట్టుకున్న బ్యూటీస్ ఎవరు..? ఈ స్టోరీలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిని ఆపద్భాందవుడిగా ఫీల్ అవుతున్నారు ఆయనతో కలిసి నటిస్తున్న హీరోయిన్స్.
Updated on: Aug 12, 2025 | 9:32 PM

మెగాస్టార్ చిరంజీవిని ఆపద్భాందవుడిగా ఫీల్ అవుతున్నారు ఆయనతో కలిసి నటిస్తున్న హీరోయిన్స్. ప్రజెంట్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు చిరు. ఆ రెండు సినిమాల్లో సీనియర్ హీరోయిన్లతోనే జోడీ కడుతున్నారు.

ఆ హీరోయిన్ల కెరీర్‌కు చిరుతో కలిసి నటిస్తున్న ఈ సినిమాల సక్సెస్ ఎంతో కీలకం కానుంది. విశ్వంభర సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష, చిరుకు జోడీగా నటిస్తున్నారు.

చాలా రోజులుగా బిగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ, మెగా మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మరోసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నారు.

విశ్వంభరతో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ సౌత్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. ప్రజెంట్ నార్త్‌లోనూ అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న ఈ బ్యూటీ, చిరుతో చేస్తున్న స్పెషల్ సాంగ్ తన ఫేట్ మారుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

మెగా 157 విషయంలోనూ ఇలాంటి అంచనాలే ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్నా... సక్సెస్ చూసి చాలా రోజులవుతోంది. అందుకే చిరంజీవి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్‌లో వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోయిన్లంతా మెగాస్టార్ అప్ కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు.




