- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi and Trisha Vishwambhara Teaser Update Telugu Heroes Photos
Chiranjeevi: లెక్కేసి మరీ కొడుతున్న చిరంజీవి.. మెగాస్టార్ ఆశలన్ని ఆ సినిమాపైనే.!
ప్లానింగ్ అంటే విశ్వంభర.. విశ్వంభర అంటే ప్లానింగ్.. అందులో మాత్రం తగ్గేదే లే అంటున్నారు దర్శకుడు వశిష్ట. ఒక్క సినిమా అనుభవమే ఉన్నా.. షూటింగ్ విషయంలో మాత్రం 10 సినిమాల అనుభవం చూపిస్తున్నారు వశిష్ట. 200 కోట్ల సినిమాను ఈయన డీల్ చేస్తున్న విధానానికే అంతా ఫిదా అవుతున్నారు. అసలు విశ్వంభర అప్‌డేట్స్ ఏంటి..? ఇంకా షూట్ ఎంత బ్యాలెన్స్ ఉంది..? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది.
Updated on: Jul 22, 2024 | 8:19 PM

ప్లానింగ్ అంటే విశ్వంభర.. విశ్వంభర అంటే ప్లానింగ్.. అందులో మాత్రం తగ్గేదే లే అంటున్నారు దర్శకుడు వశిష్ట. ఒక్క సినిమా అనుభవమే ఉన్నా.. షూటింగ్ విషయంలో మాత్రం 10 సినిమాల అనుభవం చూపిస్తున్నారు వశిష్ట.

200 కోట్ల సినిమాను ఈయన డీల్ చేస్తున్న విధానానికే అంతా ఫిదా అవుతున్నారు. అసలు విశ్వంభర అప్‌డేట్స్ ఏంటి..? ఇంకా షూట్ ఎంత బ్యాలెన్స్ ఉంది..? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు. మధ్యలో ఆచార్య అనుకున్నా.. జస్ట్ మిస్ అయిపోయింది ఈ జోడీ.

త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంభరలో నటిస్తున్నారు. అంజి తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఇది. అందులోనూ నమ్రత శిరోద్కర్‌తో పాటు రీమా సేన్, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మి రాయ్, అల్ఫోన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

అంటే పాత సినిమాల సంగతి సరే.. కొత్తగా ఏమైనా ఆశించవచ్చా? అని అడిగేవాళ్లకు.. మై హూనా అంటూ భరోసా ఇస్తున్నారు డైరక్టర్ వశిష్ట. మీరు ట్రెండ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

ఆయన నయా సినిమా అనౌన్స్ మెంట్ అదే రోజు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గాడ్‌ఫాదర్‌తో తార్ మార్ టక్కర్‌మార్ చేసిన రాజా డైరక్షన్‌లో కొత్త సినిమాను ప్రకటించడానికి సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్.

వాయిదా రూమర్స్‌కు చెక్ పెట్టే ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఒక్క పాట మినహా చిరు పోర్షన్ షూటింగ్ అంతా పూర్తయ్యింది. మిగత వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు జెట్ స్పీడుతో వర్క్ చేస్తోంది మూవీ టీమ్.




