- Telugu News Photo Gallery Cinema photos Is Hebah Patel getting married? Haldi function photos goes viral
ఇదేందబ్బా..! పెళ్ళికి రెడీ అయినా హెబ్బా.! వైరల్ అవుతున్న ఫోటోలు
కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి.
Updated on: Jul 22, 2024 | 9:43 PM

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి.

కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది కుర్రాళ్ళు హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు. అంతలా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి ఈ చిన్నదానికి.

కానీ కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి ఈ అమ్మడికి.దాంతో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. చివరకు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

రామ్ హీరోగా నటించిన రెడ్ అనే సినిమాలో స్సెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాతో ఎక్కువగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి.

తాజాగా హల్దీ ఫంక్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి హెబ్బా అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.




