- Telugu News Photo Gallery Cinema photos Mega Wedding to Vijay Sethupathi New Movie Latest Film updates from industry
Movie Update: మరో ఇంట్రస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మక్కల్ సెల్వన్.. ఘనంగా మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..
మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. లియో మూవీ మరో రేర్ రికార్డ్ సెట్ చేసింది. సోమవారం రిలీజ్ అయిన టైగర్ 3 ట్రైలర్ చరిత్ర సృష్టిస్తోంది. మోస్ట్ అవెయిటెడ్ ట్రైలర్ కావటంతో రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది టైగర్ 3 ట్రైలర్. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరిపేరు భైరవకోన.
Updated on: Oct 21, 2023 | 3:33 PM

మెగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటకు కుటుంబ సభ్యులు వరుసగా పార్టీలు ఇస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పార్టీ జరగింది. ఈ సారి అల్లు ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చేసింది. ఈ పార్టీలో చిరంజీవి, అల్లు అరవింద్‌తో పాటు మెగా , అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరో ఇంట్రస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

లియో మూవీ మరో రేర్ రికార్డ్ సెట్ చేసింది. యూరప్ రీజియన్‌లో 37 దేశాల్లో రిలీజ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించబోతోంది. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

సోమవారం రిలీజ్ అయిన టైగర్ 3 ట్రైలర్ చరిత్ర సృష్టిస్తోంది. మోస్ట్ అవెయిటెడ్ ట్రైలర్ కావటంతో రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది టైగర్ 3 ట్రైలర్. కేవలం ఒక గంటలో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ మూవీ ట్రైలర్‌గా రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరిపేరు భైరవకోన. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ మాత్రం ఆలస్యమవుతోంది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గ్రాఫిక్స్ విషయంలో మరింత క్వాలిటీ కోసమే టైమ్ తీసుకుంటున్నామని వెల్లడించారు.

మరో ఇంట్రస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. మిస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన పిశాచి 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే అదే దర్శకుడితో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం హిందీలో మేరి క్రిస్మస్, తమిళ్‌లో మహారాజా సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి.




