Vijayashanthi: క్రేజీ కాంబినేషన్ షురూ.. నందమూరి హీరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ఇచ్చిన విజయశాంతి
సరిలేరు నీకెవ్వరు తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలకు దూరంగా ఎందుకున్నారు..? ఒక్క సినిమా కోసమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారా..? లేదంటే మహేష్ కోసమే సరిలేరు నీకెవ్వరులో నటించారా..? మూడేళ్లుగా ఏ సినిమాకు సైన్ చేయని విజయశాంతి.. ఇప్పుడు నందమూరి హీరో సినిమాలో ఒప్పుకోడానికి కారణమేంటి..? అసలేంటి ఆ సినిమా..? విజయశాంతి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.. ఇంకా చెప్పాలంటే ఈమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు.
Updated on: Oct 21, 2023 | 3:03 PM

సరిలేరు నీకెవ్వరు తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాలకు దూరంగా ఎందుకున్నారు..? ఒక్క సినిమా కోసమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారా..? లేదంటే మహేష్ కోసమే సరిలేరు నీకెవ్వరులో నటించారా..? మూడేళ్లుగా ఏ సినిమాకు సైన్ చేయని విజయశాంతి.. ఇప్పుడు నందమూరి హీరో సినిమాలో ఒప్పుకోడానికి కారణమేంటి..? అసలేంటి ఆ సినిమా..?

విజయశాంతి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.. ఇంకా చెప్పాలంటే ఈమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న నటి విజయశాంతి. లేడీ అమితాబ్ బచ్చన్ అనే బిరుదుతో పాటు ఆ రేంజ్ క్రేజ్ కూడా తెచ్చుకున్నారీమె. అలాంటి విజయశాంతి సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.

అప్పటికే పదేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి.. అనిల్ రావిపూడి కథ నచ్చి సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించారు. అయితే అది విజయశాంతి రేంజ్ రోల్ కాదని.. రిలీజ్ తర్వాత ఆమె ఫ్యాన్స్ కూడా ఫీలయ్యారు. ఏముంది అందులో అంటూ నిట్టూర్చారు. దాంతో మళ్లీ సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాకు సైన్ చేసారు.

సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమాలు చేయనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన విజయశాంతి.. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చెప్పిన కథ నచ్చి కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్.

తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ NKR 21ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి చూడాలిక.. విజయశాంతి ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తారేమో..?




