- Telugu News Photo Gallery Cinema photos Will Balakrishna get a successful box office hattrick with Bhagavanth Kesari movie
Bhagavanth Kesari: బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టినట్టేనా.. భగవంత్ కేసరి పరిస్థితి ఏంటి..?
భగవంత్ కేసరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ అందుకుంటాడని వాళ్ళు నమ్ముతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19 విడుదలైంది. బాలయ్య కెరీర్ లో వినూత్న ప్రయత్నంగా వచ్చింది ఈ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ బాలయ్య సినిమాలా కాకుండా సోషల్ మెసేజ్ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. కొత్తగా ఉందంటూ ప్రేక్షకులు కూడా దీనిని ఆదరిస్తున్నారు.
Updated on: Oct 21, 2023 | 1:08 PM

భగవంత్ కేసరి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ అందుకుంటాడని వాళ్ళు నమ్ముతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19 విడుదలైంది. బాలయ్య కెరీర్ లో వినూత్న ప్రయత్నంగా వచ్చింది ఈ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ బాలయ్య సినిమాలా కాకుండా సోషల్ మెసేజ్ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి.

కొత్తగా ఉందంటూ ప్రేక్షకులు కూడా దీనిని ఆదరిస్తున్నారు. కాకపోతే ఓపెనింగ్ విషయంలో మిగిలిన బాలయ్య సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువగా వచ్చింది భగవంత్ కేసరి. వీరసింహారెడ్డిలో సగం కూడా తీసుకురాలేదు ఈ సినిమా. సంక్రాంతి విడుదలైన సినిమా తొలి రోజు ఏకంగా 65 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే.. అందులో సగం భగవంత్ కేసరి తీసుకొచ్చింది. దానికి కారణం లియో పోటీలో ఉండడమే.

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో పాటు థియేటర్స్ షేరింగ్ ఉండడంతో బాలయ్య సినిమాకు కాస్త వసూలు తగ్గాయి. అయితే రెండో రోజు నుంచి ఈ సినిమాకు ఫ్యామిలీస్ బాగానే కనెక్ట్ అవుతున్నట్టు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

అందుకే దసరా సెలవులు అయిపోయిన తర్వాత కూడా లాంగ్ రన్ ఈ సినిమాకే ఉంటుంది అంటున్నారు వాళ్ళు. రెండో రోజు కూడా ఈ సినిమాకు దాదాపు 6 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజుల్లో 51 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు దర్శక నిర్మాతలు పోస్టర్స్ విడుదల చేశారు. చాలా చోట్ల బాలయ్య సినిమా స్టడీ కలెక్షన్స్ తీసుకొస్తుంది. మూడో రోజు కూడా మంచి ఓపెనింగ్స్ తోనే మొదలైంది ఈ సినిమా.

ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందని నమ్మకం ఉండడంతో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. ఈ సినిమాకు 65 కొత్త బిజినెస్ జరిగింది. 70 కోట్లకు పైగా వస్తే సినిమా హిట్ స్టేటస్ అందుకుంటుంది. ప్రస్తుతం స్లో అండ్ స్టడీ అన్నట్టు వెళ్తున్నాడు కేసరి. ఇదే కంటిన్యూ అయితే దసరా సెలవులు పది రోజులు ఉంటాయి కాబట్టి కచ్చితంగా సినిమా సేఫ్ జోన్ లోకి వస్తుంది.

పైగా టైగర్ నాగేశ్వరరావు, లియో కంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అంశాలు బాలయ్య సినిమాలోనే ఉన్నాయి. కాబట్టి ఇది అడ్వాంటేజ్. మరి వీటన్నింటితో బాలయ్య ఏం చేస్తాడో చూడాలి




