- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu to be seen in new look in Guntur Kaaram movies releasing on January 12th
Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్న త్రివిక్రమ్..
చూస్తుండగానే గుంటూరు కారం షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. అందుకే సినిమా ఎలా వస్తుందో అనే కంగారు అభిమానుల్లోనూ పెరిగిపోతుంది. అయితే అలాంటి కంగారే అవసరం లేదు.. పాత బాకీ మొత్తం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాలే అంటున్నారు త్రివిక్రమ్. ఇంతకీ గుంటూరు కారం కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..? కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే అంచనాలు మామూలుగా ఉండవు.. మహేష్, త్రివిక్రమ్ కూడా అలాంటిదే. నిజం మాట్లాడుకుంటే.. ఈ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ కాదు.. కానీ కల్ట్ క్లాసిక్స్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Dec 26, 2023 | 1:36 PM

చూస్తుండగానే గుంటూరు కారం షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. అందుకే సినిమా ఎలా వస్తుందో అనే కంగారు అభిమానుల్లోనూ పెరిగిపోతుంది. అయితే అలాంటి కంగారే అవసరం లేదు.. పాత బాకీ మొత్తం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాలే అంటున్నారు త్రివిక్రమ్. ఇంతకీ గుంటూరు కారం కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?

కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే అంచనాలు మామూలుగా ఉండవు.. మహేష్, త్రివిక్రమ్ కూడా అలాంటిదే. నిజం మాట్లాడుకుంటే.. ఈ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ కాదు.. కానీ కల్ట్ క్లాసిక్స్. అటు అతడు తీసుకున్నా.. ఇటు ఖలేజా చూసుకున్నా రెండూ కల్ట్ సినిమాలే. కలెక్షన్‌లతో పనిలేకుండా ఆడియన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాలుగా నిలిచిపోయాయి ఆ రెండూ.

12 ఏళ్ళ తర్వాత కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో గుంటూరు కారంపై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు కొన్ని కారణాలతో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆలస్యం కూడా మంచిదే.. కంగారుగా ఏదో ఒకటి చేయడం కంటే.. నెమ్మదైనా అనుకున్నది అనుకున్నట్లు చేయొచ్చు. గుంటూరు కారం విషయంలో గురూజీ ఇదే చేస్తున్నారు. వింటేజ్ మహేష్‌ను తీసుకొస్తున్నారు.

ఈ సినిమా కోసం 17 ఏళ్ళ తర్వాత స్మోకింగ్ సీన్ చేసారు మహేష్. డాన్సుల విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు.. హెయిర్ స్టైల్ పోకిరి, అతిథి సినిమాలను తలపిస్తుంది.. లుక్స్ పరంగానూ మేకోవర్ అదిరిపోయింది. అన్నింటికీ మించి కబడ్డీ సీక్వెన్స్ ఉండబోతుంది. ఒక్కడులో కబడ్డీతో రికార్డులు తిరగరాసారు మహేష్.

గుంటూరు కారంలో కబడ్డి సీన్ హైలైట్‌గా నిలవబోతుందని తెలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతుంది. న్యూ ఇయర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి వెకేషన్ వెళ్లనున్నారు మహేష్ బాబు. ముందు చెప్పినట్లుగానే జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్సైపోయారు త్రివిక్రమ్.





























