- Telugu News Photo Gallery Cinema photos Hero Srikanth son Roshan acting in Mohan Lal Pan India movie Vrushabha
Roshan: పాన్ ఇండియా వైపు అడుగులేస్తున్న రోషన్
మనలో మన మాట.. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల అరడజన్ సినిమాలు చేసారు.. మరో అరడజన్ లైన్‌లో ఉన్నాయి. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యారు. అలాగే దర్శకురాలు గౌరీ కూడా మరో సినిమాకు సైన్ చేసారు. కానీ హీరో రోషన్ మాత్రం మరో సినిమా చేయలేదు.. కనీసం అప్‌డేట్ లేదు. అసలు ఈ కుర్ర హీరో ఏం చేస్తున్నారు..? ప్యాన్ ఇండియాను తప్ప.. టాలీవుడ్‌పై రోషన్ ఫోకస్ చేయట్లేదా..? కొందరు హీరోలకు మొదటి సినిమా గుర్తింపు తీసుకురాకపోయినా.. రెండో సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది.
Updated on: Dec 26, 2023 | 1:55 PM

మనలో మన మాట.. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల అరడజన్ సినిమాలు చేసారు.. మరో అరడజన్ లైన్‌లో ఉన్నాయి. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యారు. అలాగే దర్శకురాలు గౌరీ కూడా మరో సినిమాకు సైన్ చేసారు. కానీ హీరో రోషన్ మాత్రం మరో సినిమా చేయలేదు.. కనీసం అప్‌డేట్ లేదు. అసలు ఈ కుర్ర హీరో ఏం చేస్తున్నారు..? ప్యాన్ ఇండియాను తప్ప.. టాలీవుడ్‌పై రోషన్ ఫోకస్ చేయట్లేదా..?

కొందరు హీరోలకు మొదటి సినిమా గుర్తింపు తీసుకురాకపోయినా.. రెండో సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. అలా క్రేజ్ తెచ్చుకున్న హీరో రోషన్. అప్పుడెప్పుడో స్కూల్ ఏజ్‌లోనే నిర్మల కాన్వెంట్‌తో హీరోగా పరిచయమైన ఈయన.. 2021లో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడితో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.

పెళ్లి సందడిలో రోషన్ మేకోవర్ ప్లస్ లుక్స్‌కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. మనోడు చూడ్డానికి టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా ఉన్నాడే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా వచ్చి రెండేళ్లైనా ఇంకా మరో సినిమా చేయలేదు. వైజయంతి మూవీస్‌లో ఆ మధ్య ప్రదీప్ అద్వైతంతో ఛాంపియన్ అనే పీరియాడిక్ సినిమాకు సైన్ చేసినా.. ఫస్ట్ లుక్ తప్ప మరే అప్‌డేట్ లేదు.

తెలుగు కంటే పాన్ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రోషన్. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా వృషభలో నటిస్తున్నారు రోషన్.

దాదాపు 150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందకిషోర్ దర్శకుడు. మొత్తానికి ఓన్లీ ప్యాన్ ఇండియా.. నో టాలీవుడ్ అంటున్నారు శ్రీకాంత్ తనయుడు.




