- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu fans are trending Guntur Karam movie on social media
Guntur karam: సోషల్ మీడియాలో గుంటూరు కారం ట్రెండ్.. దినికి కారణమేంటి..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?
స్పెషల్ అకేషన్ లేదు.. ఫస్ట్ లుక్ ఏం రిలీజ్ కాలేదు.. టీజర్ గురించి అప్‌డేట్ రాలేదు.. అయినా కూడా గుంటూరు కారం బజ్ మొదలైపోయింది.. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా షురూ అయిపోయింది. దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది ఈ చిత్రం. అసలు ఉన్నట్లుండి ఈ చిత్రం ట్రెండ్ అవ్వడానికి కారణమేంటి..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?
Updated on: Oct 05, 2023 | 11:46 AM

స్పెషల్ అకేషన్ లేదు.. ఫస్ట్ లుక్ ఏం రిలీజ్ కాలేదు.. టీజర్ గురించి అప్‌డేట్ రాలేదు.. అయినా కూడా గుంటూరు కారం బజ్ మొదలైపోయింది.. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా షురూ అయిపోయింది. దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది ఈ చిత్రం. అసలు ఉన్నట్లుండి ఈ చిత్రం ట్రెండ్ అవ్వడానికి కారణమేంటి..? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది..?

ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్న టైమ్‌కు గుంటూరు కారం పూర్తి చేస్తున్నారు త్రివిక్రమ్. ఆయన అనుకోవాలే కానీ ఆర్నెళ్లలో కూడా సినిమా పూర్తి చేయగలరని గతంలో అరవింద సమేతతోనే ప్రూవ్ చేసారు గురూజీ. ఇప్పుడు గుంటూరు కారంకు మరోసారి అదే చేసి చూపిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైంది.. మహేష్ పోర్షన్ చివరికి వచ్చేసింది.

గుంటూరు కారం షూటింగ్‌కు మధ్యలో అనుకోని బ్రేకులు చాలానే పడ్డాయి. దాంతో ఈ చిత్రం సంక్రాంతికి రాదేమో అనే అనుమానాలు కూడా చాలానే వచ్చాయి. అయితే ముందు నుంచి కూడా తమ సినిమా పండక్కి వస్తుందని చెప్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. చెప్పినట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నారు త్రివిక్రమ్. అక్టోబర్ చివరి నాటికే గుంటూరు కారంలో మహేష్ పోర్షన్ పూర్తి కానుంది.

హైదరాబాద్‌లో గుంటూరు కారం నాన్‌స్టాప్ షెడ్యూల్ జరుగుతూనే ఉంది. మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్‌లో ఉన్నారు. ఉన్నట్లుండి ఈ చిత్రం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దానికి కారణం రిలీజ్‌కు ఇంకా 100 రోజులు ఉండటమే. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 100 రోజులు అసలు పండగ మొదలవుతుందంటూ ట్వీట్స్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.

తనతో సినిమాలు చేసిన హీరోలందరికీ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. మహేష్‌కు మాత్రమే బాకీ పడిపోయారు. అతడు, ఖలేజా క్లాసిక్స్ అయ్యాయి కానీ బ్లాక్‌బస్టర్స్ కాలేదు. దాంతో గుంటూరు కారంతో ఆ బాకీ తీర్చేయాలని చూస్తున్నారు. మరోవైపు గుంటూరు కారం తర్వాత రాజమౌళి కంటే ముందే.. అనిల్ రావిపూడి సినిమా చేయాలని చూస్తున్నారకు మహేష్.




