Leo: రజనీకాంత్‌ని టార్గెట్ చేసిన విజయ్.. లియో 500కోట్లు!
డైరక్టర్ లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లియో 500 కోట్ల మార్క్ దాటేసింది. దళపతి విజయ్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా లియో. బాక్సాఫీస్ దగ్గర మామూలుగా లేవు వసూళ్లు. సినిమా విడుదలైన తొలి వారంలోనే దాదాప 500 కోట్ల మార్కు దాటేసింది లియో. లియో డొమెస్టిక్ కలెక్షన్లు 262 కోట్లు. డొమెస్టిక్ వైజ్ కలెక్షన్లలో తమిళ సినిమాల్లో రెండో హయ్యస్ట్ గ్రాసింగ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తోంది లియో. ఆల్రెడీ రజనీకాంత్ నటించిన జైలర్ 343.47 కోట్ల లైఫ్ టైమ్ కలెక్షన్లతో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ఆల్ టైమ్ తమిళ సినిమా కలెక్షన్లలో మూడో ప్లేస్‌లో ఉంది లియో. రజనీకాంత్ నటించిన జైలర్ ఫస్ట్ ప్లేస్‌లో, 2.0 సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




